ఆధార్ అక్రమాలతో ఎయిర్‌టెల్‌కి భారీ షాక్ ! భారీ జరిమానా తప్పదా ?

By Hazarath
|

Airtel కంపెనీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌పై మండిపడింది. కస‍్టమర్ల అనుమతిలేకుండా.. బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. అక్రమాలకు పాల్పడిన కేసులో ఎయిర్‌టెల్ చిక్కుకుంది.

 

భారీ బ్యాటరీతో భారత్ 5, డేటా ఆఫర్లతో మార్కెట్లోకి..భారీ బ్యాటరీతో భారత్ 5, డేటా ఆఫర్లతో మార్కెట్లోకి..

కస్టమర్ల అనుమతి లేకుండా..

కస్టమర్ల అనుమతి లేకుండా..

మొబైల్‌ లింకింగ్‌ సందర్భంగా కస్టమర్ల అనుమతి లేకుండా పేమెంట్స్​ బ్యాంకు అ​కౌంట్లు తెరిచిందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా Airtelను ఆధార్‌ ఆదేశించింది.

ఆధార్ నెంబర్లతో వారికి తెలీకుండా..

ఆధార్ నెంబర్లతో వారికి తెలీకుండా..

మొబైల్‌ నంబర్లకు ఆధార్ లింకింగ్ కోసం రిక్వెస్ట్ చేసిన వారి పేరిట ఆ ఆధార్ నెంబర్లతో వారికి తెలీకుండా ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ అకౌంట్లని సృష్టించింది. ఎల్‌పీజీగ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు (డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ) సబ్సిడీని ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ఖాతాలో చేరేలా అక్రమాలకు పాల్పడింది.

కస్టమర్లు యుఐడిఎఐకి ఫిర్యాదు

కస్టమర్లు యుఐడిఎఐకి ఫిర్యాదు

ఎయిర్‌టెల్‌ యూజర్లకు సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాల్లో కాకుండా ఎయిర్‌ టెల్‌ చెల్లింపుల బ్యాంకు ఖాతాలో జమ అయింది.దీంతో షాక్‌ అయిన కస్టమర్లు యుఐడిఎఐకి ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం తమ పరిశీలనలో..
 

ప్రస్తుతం తమ పరిశీలనలో..

దీనిపై స్పందించిన సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుపై ఎయిర్‌టెల్‌పై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్‌కు (ఎయిర్‌టెల్‌ పేరు చెప్పలేదు) నోటీసులు జారీ చేశామని యుఐడిఎఐ సీఈఓ అజరు భూషణ్ పాండే చెప్పారు. ఈ సమస్య ప్రస్తుతం తమ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు.

ఆరోపణలపై స్పందించిన ఎయిర్‌టెల్‌...

ఆరోపణలపై స్పందించిన ఎయిర్‌టెల్‌...

అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఎయిర్‌టెల్‌ బ్యాంకు ఆధార్‌, మొబైల్‌ లింకింగ్‌, పేమెంట్‌ బ్యాంకు ఖాతాల తెరవడం రెండు వైర్వేరు అని, రెండింటికీ సంబంధం లేదని తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా వినియోగదారుడి ఆధార్-లింక్డ్ ఖాతాగా ఉంటే, డిబిటి ఆటోమేటిగ్గా క్రెడిట్‌అవుతుందని వివరణ ఇచ్చింది.

 వినియోగదారుల అనుమతి లేకుండా..

వినియోగదారుల అనుమతి లేకుండా..

మరోవైపు వినియోగదారుల అనుమతి లేకుండా పేమెంట్‌ బ్యాంకు ఖాతా తెరిచిన వ్యవహారంలో భారీ జరిమానా కూడా విధించనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
UIDAI pulls up Bharti Airtel for opening payments bank accounts without 'customer consent Read More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X