Home
News

ఆ తేదీలోగా ఆధార్‌లో వివరాలు అప్‌డేట్‌ చేయకుంటే కార్డు పనిచేయదా.. UIDAI ఏం చెబుతోంది...?

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌పై (Aadhar Card Update) ఇటీవల కాలంలో కొన్ని నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పది సంవత్సరాలకు ముందు తీసుకున్న ఆధార్‌ కార్డులను జూన్‌ 14 లోగా అప్‌డేట్‌ చేయకపోతే పనిచేయవంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై UIDAI స్పందించింది.

గత పదేళ్ల నుంచి ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేయకపోయినా పనిచేస్తాయని ఆధార్‌ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. జూన్‌ 14 వరకు ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఉచితంగా అవకాశం ఉందని, అదే గడువు ముగిశాక అప్‌డేట్‌ చేసేందుకు నగదు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

UIDAI statement on Aadhaar will not be invalid if fails to update before june 14 is false

అయితే ఫోన్ నంబర్‌ వంటి వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు కచ్చితంగా ఆధార్‌ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని అటువంటి సందర్భాల్లో నగదు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గతంలో ఆధార్‌ కార్డులను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు మార్చి 14 వరకు మాత్రమే గడువు ఉండగా.. ఆ తేదీని జూన్‌ 14 వరకు పొడిగించింది.

ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకొనేందుకు పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులు, మ్యారేజీ సర్టిఫికేట్‌లు వంటిని గుర్తింపు కార్డులుగా పరిగణిస్తుంది. దీంతోపాటు అడ్రస్‌ మార్చుకొనేందుకు కూడా కొన్ని రకాల కార్డులను UIDAI సూచించింది.

పాస్‌పోర్టు, గత మూడు నెలలకు చెందిన బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, గత మూడు నెలలకు చెందిన విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు, మ్యారేజీ సర్టిఫికేట్‌, రేషన్‌ కార్డు, ప్రొపర్టి ట్యాక్స్‌, మరియు ప్రభుత్వం జారీ చేసిన కార్డుల ద్వారా ఆధార్‌ కార్డులోని అడ్రస్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్డును ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి
స్టెప్‌ 1 : ఆధార్‌ కార్డులను సొంతంగా అప్‌డేట్ చేసుకొనేందుకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
స్టెప్‌ 2 : అనంతరం అక్కడ కనిపించిన లాగిన్‌ బటన్ పైన క్లిక్‌ చేయండి. తర్వాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను సహా ఇతర వివరాలను నమోదు చేయండి.

స్టెప్‌ 3 : అనంతరం అక్కడ కనిపించిన 'Send OTP' పైన క్లిక్‌ చేయండి. తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన 6 అంకెల OTP ని ఎంటర్‌ చేయండి.
స్టెప్‌ 4 : అనంతరం అక్కడ కనిపించిన సర్వీస్ ట్యాబ్‌లో అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ అనే దానిపై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 5 : తర్వాత Proceed to Update Aadhaar అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 6 : అక్కడ మీ పేరు మరియు ఆధార్‌ నంబర్‌ కనిపిస్తాయి.
స్టెప్‌ 7 : అనంతరం అవసరమైన డాక్యుమెంట్‌లు అప్‌లోడ్‌ చెయ్యాల్సి ఉంటుంది.
స్టెప్‌ 8 : అన్ని వివరాలను తనిఖీ చేసి సమర్పించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
UIDAI statement on Aadhaar will not be invalid if fails to update before june 14 is false
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X