Airtelకు యూఐడీఏఐ నుంచి భారీ షాక్ , విచారణకు ఆదేశాలు

దేశీయ టెలికం సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్‌టెల్‌కు యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది.

By Hazarath
|

దేశీయ టెలికం సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్‌టెల్‌కు యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది. మొబైల్ వినియోగదారులతో పాటు పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారుల ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్)ని ఎయిర్‌టెల్ దుర్వినియోగం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిమ్‌ కార్డులు, బ్యాంకు క్లయింట్లకు ఆధార్‌తో లింక్‌ అయ్యే ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.

జియో రూ. 52 ప్లాన్‌కి రూ 49తో షాకిచ్చిన ఎయిర్‌టెల్జియో రూ. 52 ప్లాన్‌కి రూ 49తో షాకిచ్చిన ఎయిర్‌టెల్

సబ్‌స్క్రైబర్లకు తెలియకుండా..

సబ్‌స్క్రైబర్లకు తెలియకుండా..

సిమ్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ఆధారితంగా ఆధార్‌-కేవైసీని ఉపయోగించి సబ్‌స్క్రైబర్లకు తెలియకుండా భారతీ ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు అకౌంట్లను ప్రారంభిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో యూఐడీఏఐ ఈ చర్యలు తీసుకుంది.

వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో..

వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో..

కాగా మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్‌టెల్ ఖాతాదారుల రిక్వెస్ట్‌లను వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్‌ అకౌంట్లని సృష్టించింది.

 సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ..

సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ..

అలా సృష్టించడమే కాకుండా సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీని ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ ఖాతాలో చేరేలా చేసింది.

ఖాతాల్లో పడేలా..

ఖాతాల్లో పడేలా..

వాస్తవానికి ఎయిర్‌టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది.

గత కొన్ని నెలలుగా

గత కొన్ని నెలలుగా

గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియపై.. గ్యాస్ సబ్సిడీ ఎయిర్‌టెల్ అకౌంట్లకు మళ్లడంపై ఎయిర్‌‌టెల్‌ యూజర్లు యూఐడీఏఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుపై ఎయిర్‌‌టెల్‌‌పై విచారణకు ఆదేశించింది.

ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా

ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా

ప్రస్తుతం ఆధార్‌ ఈ-కేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుపై యూఐడీఏఐ చర్యలు తీసుకుంది.

ఎయిర్‌టెల్‌పై విచారణకు ఆదేశిస్తున్నామని..

ఎయిర్‌టెల్‌పై విచారణకు ఆదేశిస్తున్నామని..

ఈ వ్యవహారంలో ఎయిర్‌టెల్‌పై విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణ నివేదిక అందిన తర్వాత ఎయిర్‌టెల్ ఈ-కేవైసీ లైసెన్సుపై సస్పెన్షన్ ఎత్తివేయడం గానీ, తదుపరి చర్యలు చేపట్టడం గానీ చేస్తామని యూఐడీఏఐ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్‌టెల్‌ను సంప్రదించగా

ఎయిర్‌టెల్‌ను సంప్రదించగా

ఈ విషయమై ఎయిర్‌టెల్‌ను సంప్రదించగా.. యూఐడీఏఐ నుంచి తాత్కాలిక ఉత్తర్వు అందినట్లు ధ్రువీకరించింది. దీనిపై అధికారులను సంప్రదిస్తున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Best Mobiles in India

English summary
UIDAI temporarily bars Airtel from conducting Aadhaar linked e-KYC verification More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X