Home
News

e-Aadhaar App : ఆధార్‌ యాప్‌.. ఇంట్లోనే సులభంగా ఈ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు..!

e-Aadhaar App Launch : ఇ-ఆధార్‌ మొబైల్‌ యాప్‌ ను త్వరలో UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేయనుంది. ఫలితంగా అనేక వివరాలను మరింత సులభంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ నుంచి ఆధార్‌ కార్డుదారుల అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఆ యాప్‌ అందుబాటులోకి వచ్చాక.. :
ప్రస్తుతం పుట్టిన తేదీ సహా మొబైల్‌ నంబర్‌ ను అప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆధార్‌ సేవా కేంద్రాలను సందర్శించాల్సి వస్తోంది. ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చాక.. తక్కువ సమయంలోనే స్మార్ట్‌ఫోన్ నుంచే ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

e-aadhaar app launching in november

స్మార్ట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ :
అయితే ఆధార్‌ లోని ఫింగర్‌ ప్రింట్‌, ఐరిస్ వంటి వివరాలను ఆధార్‌ సేవా కేంద్రాల్లోనే అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇ-ఆధార్‌ యాప్‌ AI ఆధారిత స్మార్ట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ ( SIS ) ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ముఖ గుర్తింపు ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం మాత్రమే, ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ నెలలోనే విడుదల! :
భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి రికార్డులను ఉపయోగించి మాత్రమే ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలోనే అప్‌డేట్‌ పూర్తవుతుంది. ఇ-ఆధార్‌ యాప్‌ 2025 నవంబర్‌ నెలలో విడుదల కానుందని తెలుస్తోంది.

ధరల్లో మార్పులు :
నవంబర్‌ 1 నుంచి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అనేక మార్పులను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ వివరాలను మరింత సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు ధరల వివరాల్లోనూ మార్పులు వచ్చాయి. పేరు, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ ను అప్‌డేట్‌ చేసేందుకు రూ.75, ఫోటో, ఐరిస్‌, వేలిముద్రలు అప్‌డేట్‌ కోసం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

లింక్‌ చేయాల్సిందే :
అయితే 5 ఏళ్ల నుంచి 7 సంవత్సరాలు మరియు 15 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న ఆధార్‌ కార్డుదారులు ఉచితంగానే బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు డిసెంబర్‌ 31, 2025 నాటికి పాన్‌కార్డు ను ఆధార్‌ తో లింక్‌ చేయాల్సి ఉంటుంది.

మరింత సులభంగా కేవైసీ ప్రక్రియ :
దీంతోపాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు KYC (Know Your Customer) ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. ఆధార్‌ ఓటీటీ విధానం, వీడియో ధ్రువీకరణ, ఫేస్‌ టు పేస్‌ ధ్రువీకరణ వంటి మూడు విధాలుగా కేవైసీని పూర్తి చేయవచ్చు.

జూన్‌ 14 వ తేదీ వరకు అవకాశం :
ఇప్పటికే ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకొనేందుకు UIDAI అనేక అవకాశాలు ఇస్తోంది. ఇప్పటి వరకు సుమారు 5- 6 సార్లు అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం జున్‌ 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్స్‌ ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
UIDAI to launch e-aadhaar app in november 2025 here are th full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X