షాకంటే ఇదే: ఐఫోన్ 7ని ఫ్రీగా కొట్టేశాడు, ఎలాగంటే?

Written By:

న్యూస్ ఏంటీ చిత్రంగా ఉంది అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే..ఇతగాడు కేవలం రెండు డాలర్లు ఖర్చు పెట్టి ఏకంగా ఐఫోన్ 7నే సొంతం చేసుకున్నాడు.తన తల్లి దండ్రులు పెట్టిన పేరును సైతం మార్చుకున్నాడు. ఐఫోన్ అంటే పడిచచ్చిపోతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం వేరేది ఉండదు.

ఐఫోన్ 7 ఉచితం..అయితే చిన్న కండీషన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలెగ్జాండర్ తురిన్

ఉక్రెయిన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు పేరు అలెగ్జాండర్ తురిన్. తన తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చుకుని ఐఫోన్ 7గా పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు.

Credit: AP/Efrem Lukatsky

మొబైల్ ఫోన్లు విక్రయించే సంస్థ

కారణం ఏంటంటే స్థానికంగా మొబైల్ ఫోన్లు విక్రయించే సంస్థ ఓ వింతైన ఆఫర్ను ప్రకటించింది. ఎవరైతే తమ పేరును అధికారికంగా 'ఐఫోన్7'గా మార్చుకుంటారో వారికి ఐఫోన్ను ఉచితంగా ఇస్తామని తెలిపింది.

మొదటి ఐదుగురికి మాత్రమే

పేర్లు మార్చుకున్న మొదటి ఐదుగురికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని నియమం పెట్టింది. ఇంకేముంది ఐఫోన్ అంటే ఇష్టపడే అలెగ్జాండర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన పేరును మార్చుకున్నాడు.

అందుకు సంబంధించిన పత్రాలను

అందుకు సంబంధించిన పత్రాలను అందరికంటే ముందుగా దుకాణానికి సమర్పించాడు. దీంతో అతనికి ఆ దుకాణం ఐఫోన్7ను బహుమతిగా ఇచ్చింది.

పేరు మార్చుకునేందుకు రెండు డాలర్లు ఖర్చు

పేరు మార్చుకునేందుకు రెండు డాలర్లు ఖర్చు అయిందని అయితే 850 యూఎస్ డాలర్ల విలువ చేసే ఐఫోన్ ప్రతిఫలంగా లభించిందని మనోడు తెగ మురిసిపోతున్నాడు. భవిష్యత్లో తన పేరును మళ్లీ పాత పేరుగా మార్చుకుంటానని చెబుతున్నాడు ఈ యువకుడు. లక్కే అంటే ఇదే మరి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple fanboys are changing their names to ‘iPhone 7’ to win free devices – and that’s nuts Read more At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot