అన్ లిమిటెడ్ ఇంటర్నెట్.. రూ.47 మాత్రమే!

By Super
|
Uninor brings new GPRS pack for Andhra Pradesh

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం ఆపరేటర్ యూనినార్ సరికొత్త ఇంటర్నెట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రూ.47తో రోజువారీ పరిమితి లేని ఇంటర్నెట్ జీపీఆర్‌ఎస్ ప్యాకేజీ ‘ఎస్‌టీవీ 47’ను ప్రారంభించింది. దీంతో 30 రోజుల పాటు 1జీబీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వినియోగించుకోవచ్చు. రోజుకింత అనే పరిమితి లేకుండా తక్కువ ఖర్చులో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఎస్‌టీవీ 47 ప్యాక్... ఏపీ సర్కిల్‌లోనే మొదటిదని యూనినార్ బిజినెస్ హెడ్(ఏపీ సర్కిల్) సతీష్ కుమార్ కన్నన్ పేర్కొన్నారు.

దగ్గర్లోని యూనినార్ రిటైలర్‌ను సంప్రదించడం ద్వారా గానీ, ‘స్టార్222స్టార్7స్టార్47యాష్’కు డయల్ చేసి కూడా ఈ ప్యాకేజీని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు. జీపీఆర్‌ఎస్ సెట్టింగ్స్ కోసం ‘యాష్‌ఏఎల్‌ఎల్‌యాష్’ అని టైప్ చేసి 58355 (టోల్-ఫ్రీ) నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుందని యూనినార్ ప్రకటించింది.

రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!!

ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక నైట్‌కాలింగ్ ప్యాకేజిని ప్రవేశపెట్టింది. రూ.18 రీఛార్జ్‌తో 4000 సెకన్ల టాక్‌టైమ్ పొందే అవకశాన్ని కల్పించింది. ఈ టాక్‌టైమ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో యూనినార్‌తో సహా ఇతర నెట్‌వర్క్‌లతో మాట్లాడుకోవచ్చు. ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. రాష్ట్రంలో యూనినార్ 28 లక్షల మంది వినియోగదారులను పొందగలగింది. ఈ నెట్‌వర్క్ సేవలు దాదాపు 750 పట్టణాలతో పాటు 3,000గ్రామాలకు విస్తరించాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X