రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!!

Posted By: Prashanth

రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!!

 

ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక నైట్‌కాలింగ్ ప్యాకేజిని ప్రవేశపెట్టింది. రూ.18 రీఛార్జ్‌తో 4000 సెకన్ల టాక్‌టైమ్ పొందే అవకశాన్ని కల్పించింది.

ఈ టాక్‌టైమ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమేవినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో యూనినార్‌తో సహా ఇతర నెట్‌వర్క్‌లతో మాట్లాడుకోవచ్చు. ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. రాష్ట్రంలో యూనినార్ 28 లక్షల మంది వినియోగదారులను పొందగలగింది. ఈ నెట్‌వర్క్ సేవలు దాదాపు 750 పట్టణాలతో పాటు 3,000గ్రామాలకు విస్తరించాయి.

మొబైల్ యూజర్లుకు మరిత భారం

న్యూఢిల్లీ: 90శాతం పైగా ఉన్న ప్రీపెయిడ్ యూజర్లకు ఇక పై మొబైల్ వినియోగం మరింత భారం కానుంది. మొబైల్ రీచార్జ్ కూపన్ల ప్రాసెసింగ్ ఫీజును 50 శాతానికి పెంచే ప్రతిపాదన పై టెలికం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆమోదముద్ర వేసింది. దింతో రూ.20, అంతకు మించిన టాపప్ వోచర్ల ప్రాసెసింగ్ ఫీజు పై పరిమితి గరిష్టంగా రూ.3కు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇది రూ.2గా ఉంది. రూ.20కంటే తక్కువ విలువ కలిగిన రీచార్జ్ కూపన్‌ల పై ప్రాసెసింగ్ ఫీజు రూ.2గానే ఉంటుంది.

సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత ట్రాయ్ ఈ మేరకు సవరణలు చేసింది. రీచార్జ్ కూపన్ ఎంఆర్‌పీలోనే ప్రాసెసింగ్ ఫీజు కూడా కలిసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు పెరగడంతో ఆ మేర టాక్ టైం తగ్గుతుంది కాబట్టి వినియోగదారులే నష్టపోతారు. తాజా మార్పుల దృష్ట్యా ప్రతి సంస్థ రూ.10 విలువైన రీచార్జ్ కూపన్‌లను వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని ట్రాయ్ ఈ సందర్భంగా ఆదేశించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot