యూనినార్ యూజర్లకు ‘బ్రేకింగ్ న్యూస్’!

హైదరాబాద్: టెలికాం రంగ సంస్థ యునినార్ ఆంధ్రప్రదేశ్ కస్టమర్ల కోసం సూపర్ మాన్‌సూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.205 విలువ గల వోచర్‌ను రీచార్జ్ చేయడం ద్వారా కస్టమర్లు బంగారు నాణేలు, ఎంపీ3 ప్లేయర్లు, మొబైల్ ఫోన్లు, ఉచిత టాక్‌టైంతోపాటు బంపర్ బహుమతిగా బజాజ్ డిస్కవర్ బైక్‌ను గెలుపొందవచ్చు. అలాగే స్థానిక యునినార్ నుంచి యునినార్‌కు 1,20,000 సెకన్లు, ఇతర నె ట్‌వర్క్‌కు 42,000 సెకన్ల టాక్‌టైం లభిస్తుంది. ఈ నెల 27 వరకు రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!!
ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక నైట్‌కాలింగ్ ప్యాకేజిని ప్రవేశపెట్టింది. రూ.18 రీఛార్జ్‌తో 4000 సెకన్ల టాక్‌టైమ్ పొందే అవకశాన్ని కల్పించింది. ఈ టాక్‌టైమ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో యూనినార్‌తో సహా ఇతర నెట్‌వర్క్‌లతో మాట్లాడుకోవచ్చు. ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. రాష్ట్రంలో యూనినార్ 28 లక్షల మంది వినియోగదారులను పొందగలగింది. ఈ నెట్‌వర్క్ సేవలు దాదాపు 750 పట్టణాలతో పాటు 3,000గ్రామాలకు విస్తరించాయి.


Click it and Unblock the Notifications