యూనినార్ అపరిమిత ఫేస్‌బుక్ ప్లాన్‌లు

Posted By:

యూనినార్ అపరిమిత ఫేస్‌బుక్ ప్లాన్‌లు

దేశంలోని యువతను టార్గెట్ చేస్తూ ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ యూనినార్ అపరిమత ఇంటర్నెట్ ప్లాన్‌లతో ముందుకొచ్చింది. ఈ అపరిమిత స్కీమ్‌లలో భాగంగా చౌక ధరల్లో ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తున్నట్లు యూనినార్ సీఈఓ మోర్టెన్ కార్ల్‌సన్ సోర్బీ ఒక ప్రకటనలో తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గంటకు 50 పైసలు చొప్పున నెలకు రూ.15 రుసుముతో ఫేస్‌బుక్ అపరిమిత ప్యాకేజీని, అలాగే రోజుకు రూపాయి, వారానికి రూ.5, నెలకు రూ.15 ఛార్జీలతో వాట్స్‌యాప్ అపరిమిత ప్యాకేజీని అందిస్తున్నట్లు యూనినార్ తెలిపింది. ఈ ప్లాన్‌లను ముందుగా నెలాఖరు నాటికి గుజరాత్, మహారాష్ట్రా, గోవా ప్రాంతాల్లో అమలులోకి తీసుకురానున్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించునన్నారు.

కమ్యూనికేషన్ ప్రపంచంలో ‘చాటింగ్' సంస్కృతి కొత్త ఒరవడికి తెరలేపింది. ఆధునిక మనుషుల నిత్యకృత్యాలలో భాగంగా మారిపోయిన చాటింగ్ వినోద, విజ్ఞాన, స్నేహ బాంధవ్యాలను పెంపొందిస్తోంది. చాటింగ్ అంటే ఒకరినొకరు సంభాషించుకోవటం. ఈ ప్రక్రియ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌‍లు ఇంకా ప్రాధమిక స్థాయి ఫీచర్ ఫోన్‌ల ద్వారా సాధ్యమవుతోంది. చాటింగ్ అనేది ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా సాధ్యపడే ఓ సమాచార వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచంలో ఎక్కడనుంచైనా ప్రజలు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు. చాటింగ్ ప్రక్రియలో భాగంలో ఒక్కరితో మాత్రమే కాదు ఒకేసారి ఎంతమందితోనైనా సంభాషించుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting