రూ.3తో రోజంతా మాట్లాడుకోండి!

Posted By: Staff

రూ.3తో రోజంతా మాట్లాడుకోండి!

 

హైదరాబాద్:  రూ.3 రీచార్జ్‌తో  యూనినార్ నుంచి యూనినార్‌కు అపరమితంగా లోకల్ కాల్స్ నిర్వహించుకునే సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ యూజర్లకు కల్పిస్తున్నట్లు యూనినార్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజుకు రూ.3 రీచార్జ్‌తో యూనినార్ నుంచి యూనినార్‌కు అన్‌లిమిటెట్ లోకల్ కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ కన్నన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తమకు అత్యంత ముఖ్యమైన మార్కెటని, అందుకనే వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలందించే తక్కువ టారిఫ్ ప్లాన్లనందిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షలకుపైగా వినియోగదారులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.

జనాభా కన్నా సెల్‌ఫోన్ అకౌంట్లే అధికం!

సెల్‌ఫోన్ ఆకౌంట్‌ల సంఖ్య 2014 కల్లా ప్రపంచ జనాభాను మించిపోనుంది. ఇప్పటికే 100 పైగా దేశాల్లో జనాభా కన్నా సెల్‌ఫోన్ అకౌంట్లే అధికంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రూపొందించిన ‘ఇన్ఫర్మేషన్ సొసైటీ 2012’  నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల (వందల కోట్లు) సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉండగా 2014కి ఇవి 730 కోట్లకు చేరతాయి. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లే ఉంటుంది. ఇప్పటికే రష్యాలో జనాభాకు 1.8 రెట్లు అధికంగా 25 కోట్ల మేర సెల్‌ఫోన్ అకౌంట్లు ఉన్నాయి. అటు బ్రెజిల్‌లో 1.2 రెట్లు అధికంగా 24 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఐటీయూ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్లకు చైనా ప్రధాన మార్కెట్‌గాను, ప్రపంచంలో పావు భాగం ఇంటర్నెట్ యూజర్లకు కేంద్రంగాను నిలుస్తోంది

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot