కేంద్ర బడ్జెట్ 2021: ఫోన్ విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ పెంపు!! స్వల్పంగా పెరగనున్న మొబైల్ ఫోన్ ధరలు..
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2021 సంవత్సరం యొక్క కేంద్రం బడ్జెట్ ను ప్రకటించారు. ఇందులోని వివరాల విషయానికి వస్తే టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విభాగంలో భారీ మార్పును ప్రకటించింది. టెక్నాలజీ పరిశ్రమలోని అతిపెద్ద ప్రకటనలలో ఒకటైన మొబైల్ ఛార్జర్‌లు మరియు ఫోన్‌ల యొక్క కొన్ని ఉప భాగాల మీద కస్టమ్ డ్యూటీని పెంచనున్నట్లు ప్రకటించారు. మొబైల్ ఫోన్‌లలో విడి భాగాల మీద NIL కస్టమ్ డ్యూటీ నుండి మోడరేట్ కస్టమ్ డ్యూటీకి 2.5 శాతం వరకు వెళ్తాయని సీతారామన్ ప్రకటించారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల స్థానిక తయారీని పెంచడానికి ఛార్జర్లు మరియు మొబైల్ ఫోన్ల భాగాలపై మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ప్రకటనలో ఎఫ్ఎమ్ తెలిపింది. సరళంగా చెప్పాలంటే దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు స్వల్పంగా పెరుగుతాయని ఆశించవచ్చు.

దేశీయ ఎలక్ట్రానిక్ తయారీని పెంచడమే దీని వెనకున్న ఆలోచన. గత సంవత్సరం దేశీయ తయారీ బాగా పెరిగిందని ఎఫ్‌ఎం తెలిపింది. ఇప్పుడు మొబైల్ మరియు ఛార్జర్‌ల వంటి వస్తువులను ఎగుమతి చేస్తున్నాము. ఎక్కువ దేశీయ విలువ చేర్పుల కోసం మేము ఛార్జర్‌ల భాగాలు మరియు మొబైల్ ఫోన్‌ల ఉప భాగాలపై మినహాయింపును ఉపసంహరించుకుంటున్నాము. మొబైల్ యొక్క కొన్ని భాగాల మీద నిల్ రేటు నుండి 2.5 శాతం వరకు మారుతాయి అని బడ్జెట్ 2021 ప్రకటన సందర్భంగా సీతారామన్ చెప్పారు.


Click it and Unblock the Notifications