Home
News

Budget 2024 ప్రాధాన్యరంగాలకు భారీ కేటాయింపులు, మొబైల్‌ ఫోన్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Finance Minister Sitharaman) ఏడోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 9 ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్‌ ను (Union Budget 2024) రూపొంచినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అనేక ప్రాధాన్య రంగాలకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. పన్ను ఆధాయం రూ.28.83 లక్షలు కోట్లు గా ఉంటుందని అంచనా వేశారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రుణ సదుపాయం :
ఉద్యోగాలు కల్పన, నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనపు ప్రోత్సాహం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థికసాయం అందిస్తామని ప్రకటన చేశారు.

finance minister sitharaman

రూ.10 లక్షల వరకు రుణాలు :
ఎగుమతులు ఇతర సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామన్నారు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. 12 పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

వాణిజ్య అనుకూల విధానాలకు జన విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. దీంతోపాటు భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు పై ప్రకటన చేశారు. దీంతోపాటు మొబైల్‌ ఫోన్ల పై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు పై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మొబైల్‌ ఫోన్లపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు :
అయితే ఈ కేంద్ర బడ్జెట్‌ 2024 (Union Budget 2024) లో అనేక మంది ఎదురుచూస్తున్న మొబైల్ ఫోన్లు, మొబైల్‌ ఛార్జర్లు, పీసీడీఏలపై విధించే బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. స్మార్ట్‌ ఫోన్‌ లు ఎక్కువగా ఉపయోగిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఎక్కువ మంది పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Union Budget 2024 finance minister sitharaman announced reduction in basic custom duty on mobile phone components
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X