Home
News

Union Budget 2025 రేపు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌.. లైవ్‌ ఎక్కడ చూడాలి..!

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం మూడోసారి కొలువుతీరింది. రేపు కేంద్ర బడ్జెట్‌ ను (Union Budget 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు తాత్సాలిక, పూర్తిస్థాయిలో ఏకంగా 7 సార్లు బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. రేపు 8 సారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు గరిష్ఠంగా మాజీ ప్రధాని దివంగత మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక సర్వేను లోక్‌సభ ముందుకు తీసుకురావడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంట్‌ ముందుకు ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) తీసుకొచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితి, రానున్న సంవత్సర కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఇందులో పొందుపరుస్తారు.

Union Budget 2025

ఎన్నో ఆశలు :
కేంద్ర బడ్జెట్‌పై తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. అయితే మధ్యతరగతి సహా యువతకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత రంగాలకు భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

అధిక ప్రాధాన్యత దక్కుతుందా ? :
అయితే అన్ని రంగాలతోపాటు టెక్నాలజీ కి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కోసం కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ దేశాలు AI చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మన దేశం కూడా సొంత ఏఐ మోడల్‌ను ఆవిష్కరించనుందని కేంద్ర ఐటీ మంత్రి ఇప్పటికే వెల్లడించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ChatGPT, Gemini, మెటా AI సహా తాజాగా విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన డీప్‌సీక్‌ ల కంటే అధునాతనంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో టెలికాం రంగానికి భారీగా కేటాయింపులు చేసిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లోనూ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు మొబైల్స్‌, ట్యాప్‌టాప్‌, కెమెరా లెన్స్‌, LED టీవీలపై టారిఫ్‌లు తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. డ్యూటీ ట్యాక్స్‌ తగ్గించే.. అధిక శాతం ప్రజలకు ఊరటనిస్తుంది. అయితే బడ్జెట్‌లో ఈ తరహా ప్రకటనలు ఉండనున్నాయో లేదో చూడాల్సి ఉంది. గతంలో BSNL పరిస్థితి మెరుగుపడేందుకు భారీగా కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌లోనూ ఆ దిశగా ఆశించవచ్చు.

ఈ సంవత్సరం మే నాటికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో 4G సర్వీసులను అందించాలని BSNL భావిస్తోంది. ఇందుకోసం లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు జూన్ నుంచి 5G సర్వీసులను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు కేటాయింపులు అవసరం కాగా.. బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను DD న్సూస్‌, లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్‌ టీవీ (Sansad Tv) సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ మరియు ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ ద్వారా లైవ్‌ చూడవచ్చు.

దీంతోపాటు ఫేస్‌బుక్‌, X, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర ప్లాట్‌ఫాంలలో ప్రభుత్వానికి సంబంధించిన పేజీల ద్వారా ఎప్పటికప్పుడు బడ్జెట్‌ అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. దీంతోపాటు నిపుణుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవచ్చు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆ పత్రాలను www.indiabudget.gov.in లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Union Budget 2025 nirmala sitharaman set to present budget on tomorrow how to watch live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X