Home
News

గూగుల్‌ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హై రిస్క్‌ అలెర్ట్‌.. వెంటనే ఏం చేయాలో తెలుసా..?

గూగుల్‌ క్రోమ్‌ యూజర్ల కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీం (CERT-In) కీలక సూచనలు చేసింది. క్రోమ్ వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రౌజర్‌ లో అనేక భద్రతా లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఈ కారణంగా రిమోట్‌ గా సిస్టమ్‌ యాక్సెస్‌ ను పొందే అవకాశం ఉందని హెచ్చరించింది. మరియు ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీలుగా కీలక సూచనలు చేసింది.

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లు (Google Chrome) వెంటనే తమ బ్రౌజర్‌ లను అప్‌ డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In సూచించింది. ఈ ఏజెన్సీ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థను సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌ గా వ్యవహరిస్తారు.

google chrome users

ఇండియన్ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఆధారంగా 131.0.6778.204/.205 కు ముందున్న విండోస్‌, Mac గూగుల్‌ క్రోమ్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ లు మరియు 131.0.6778.204 ముందున్న Linux డెస్క్‌టాప్‌ వెర్షన్‌ లు ప్రభావితం అయ్యాయని తెలిపింది. క్రోమ్‌ లో ఈ భద్రతా లోపాల కారణంగా సున్నితమైన సమాచారం లీక్‌ లేదా సిస్టమ్‌ స్టెబిలిటీని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

గూగుల్‌ క్రోమ్ భద్రతా లోపాల కారణంగా డివైజ్‌ లు ప్రభావం కాకుండా... క్రోమ్‌ కొత్త వెర్షన్‌ కు అప్‌ డేట్‌ కావాలని సూచించింది. గూగుల్‌ ఇప్పటికే విండోస్‌, మ్యాక్‌ మరియు Linux డెస్క్‌టాప్‌ వెర్షన్‌ లకు సంబంధించి అప్‌డేట్‌ లు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.

గూగుల్‌ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ హ్యాకింగ్‌ కారణంగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. దీనివల్ల యూజర్‌ డేటా బహిర్గతం మరియు 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ను దాటివెళ్లే విధంగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 24 న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన సైబర్‌ హావెన్‌ సైబర్‌ దాడి గురించి వెల్లడించింది. అయితే పూర్తి సమాచారం తెలియలేదు.

అయితే కనీసం 26 ఎక్స్‌టెన్షన్‌ ను ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు గూగుల్‌ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గూగుల్‌ సపోర్టు పేజీ మాత్రం బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌ కు సంబంధించిన భద్రత సూచనలను మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది.

సైబర్‌ అటాక్‌ల వంటి సమయాల్లో వ్యక్తిగత డేటా భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. చాలా వెబ్‌సైట్‌లు మీ డేటాను స్టోర్‌ చేస్తుంటాయి. అంటే మీరు వెబ్‌సైట్‌లలో వెతికే సమాచారాన్ని స్టోర్‌ చేసే అవకాశం ఉంది. అయితే సెట్టింగ్స్‌లో మార్పులు చేసి మీ డేటా స్టోర్‌ కాకుండా చూడవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత కుడి వైపున ఉన్న మూడు చుక్కలపైన క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించిన సెట్టింగ్స్‌ను ట్యాప్‌ చేయాలి. అనంతరం కిందకు స్క్రోల్‌ చేయాలి. తర్వాత సైట్‌ సెట్టింగ్స్‌ను క్లిక్ చేయాలి. ఆన్‌ డివైస్‌ సైట్‌ డేటా అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. అక్కడ బటన్‌ను ఆఫ్‌ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
union government issues high risk alert for google chrome users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X