ఆపిల్ వినియోగదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరిక.. లేకుంటే ప్రమాదమే?
ఆపిల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రమాద హెచ్చరికలు జారీచేసింది. స్మార్ట్‌ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆపిల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వెంటనే ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆధీకృత సంస్థ వెల్లడించింది.
ఆపిల్ పరికరాలు సాధారణంగా కలిగి ఉండే సఫారీ, ఇతర బ్రౌజర్‌లలో ఉపయోగించే వెబ్‌కిట్ ఇంజిన్‌లో కొన్ని తేడాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెల్లడించింది. ఇటువంటివి ఐఫోన్ సహా ఇతర స్మార్ట్‌వాచ్‌లలో ఇతర ఉత్పత్తులు కలిగి ఉంటాయి.

సెక్యూరిటీ కంపోనెంట్, కెర్నల్‌లో సమస్య, వెబ్‌కిట్ కాంపోనెంట్‌లో లోపం కారణంగా కొన్ని తేడాలు ఆపిల్ పరికరాల్లో ఉన్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కొన్ని అభ్యర్థనల ద్వారా అటాన్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమస్య కారణంగా ఏయే పరికరాలు ప్రమాదంలో ఉన్నాయో వెల్లడించింది.
ఆపిల్ iOS 16.7 వెర్షన్ కంటే ముందు మరియు iPadOS 16.7 వెర్షన్ కంటే ముందున్న వెర్షన్‌లు ఈ సమస్య కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆపిల్ macOS Moneterey వెర్షన్ 12.7 కంటే ముందున్న డివైస్‌లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
అలాగే ఆపిల్ WatchOS 9.6.3 కంటే ముందున్న వెర్షన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆపిల్ iOS 17.0.1 ముందున్న వెర్షన్ దాంతోపాటు iPadOS 17.0.1 కంటే ముందు వెర్షన్ కలిగి ఉన్న పరికరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
దాంతోపాటు ఆపిల్ సఫారీ వెర్షన్ 16.6.1 కంటే ముందున్న వెర్షన్, ఆపిల్ macOS Ventura వెర్షన్ 13.6 ముందున్న వెర్షన్, ఆపిల్ WatchOS 10.0.1 కంటే ముందున్న వెర్షన్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందని హెచ్చరింది. తన డివైస్‌లు భద్రంగా ఉంచుకోవాలనే వినియోగదారులు తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ కావాలని సూచించింది.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆపిల్ తాజా OS వెర్షన్‌లు cert-in.org.inలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వెంటనే ఇప్పటికి పాత వెర్షన్ OSలు వినియోగిస్తున్న వారు వెంటనే తన పరికరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. లేకుంటే వినియోగదారులు వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేసింది.
డిజిటల్ పరికరాల తయారీ సంస్థలు క్రమం తప్పకుండా ఉత్పత్తి చేసిన OS వెర్షన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ప్రతి కొత్త అప్‌డేట్‌లో బగ్స్ సహా ఇతర సమస్యలకు చెక్ పెట్టేలా తయారీ సంస్థలు తాజా వెర్షన్‌లను విడుదల చేస్తుంటాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








