మీరు ప్రస్తుతం ఎటువంటి ఛార్జర్‌ను వినియోగిస్తున్నారు.. త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి..?
మొబైల్ ఛార్జింగ్ అంశంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ తరహాలో అన్ని ఫోన్ లకు ఒకే తరహా ఛార్జింగ్ పోర్టును ఉపయోగించాలని భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా స్మార్ట్‌ఫోన్ ల తయారీదారులకు ఇందుకు సంబంధించిన గడువును విధించినట్లు (Indian government to mandate USB-C ports to all devices) తెలుస్తోంది. కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని తప్పనిసరి చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
లైవ్ మింట్ సహా అనేక నివేదికల ఆధారంగా 2025 సంవత్సరం మార్చి నుంచి జూన్‌కు ఈ గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ తరహాలోనే భారత్‌లోనూ USB-C ఛార్జింగ్ పోర్టును స్టాండర్డ్‌గా మార్పులు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ కూడా C- టైప్ ఛార్జింగ్ పోర్టును తప్పనిసరి చేయనున్నారు.

వీటితోపాటు ల్యాప్‌టాప్‌లకు కూడా USB-C ఛార్జింగ్ పోర్టును తప్పనిసరి చేయనున్నారు. 2026 సంవత్సరం చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదే ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్‌లకు కూడా ఇదే తరహా మార్పులు చోటుచేసుకొనేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రపంచంలో పెద్ద సమస్యగా ఉన్న ఇ- వ్యర్థాలను తగ్గించేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపిల్ సహా ఇతర బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు USB-C ఛార్జింగ్ పోర్టులతో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇతర సంస్థలు కూడా USB-C ఛార్జింగ్ పోర్టులకు మారేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ స్టాండర్డ్ ఛార్జింగ్ పోర్టు ద్వారా అనేక మందికి ఉపయోగం ఉంటుందని తెలుస్తోంది. అన్ని ఫోన్‌లు ఛార్జింగ్ చేసేందుకు ఒకే ఛార్జర్ ను ఉపయోగించేందుకు వీలుంటుంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యూనివర్సల్ ఛార్జింగ్ పోర్టును మాత్రమే ఉపయోగించాలని తయారీదారులకు సూచించనుంది.
ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (EU) స్టాండర్డ్ ఛార్జింగ్ నిబంధన పై తుది నిర్ణయం తీసుకుంది. డబ్బు ఆదా చేయడం సహా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా EU ఈ నిర్ణయం తీసుకుంది. అయితే EU కంటే భారత్ దేశంలో తయారీదారులకు 6 నెలల ఎక్కువ సమయం గడువు ఇచ్చింది.
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. అయితే యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ నుంచి USB-C ఛార్జర్‌ను ఉపయోగిస్తోంది. అంతకంటే ముందు ఆపిల్ ఫోన్‌లు లైట్‌నింగ్ పోర్టులను కలిగి ఉండేవి. ఈ కేబుల్‌లతో పోలిస్తే USB-C ఛార్జర్ కేబుల్ డేటా బదిలీ వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








