Home
News

EPFO సభ్యులకు గుడ్‌న్యూస్‌.. PF విత్‌డ్రా నగదు పరిమితి రూ.5 లక్షల వరకు పెంచే అవకాశం..!

EPFO సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం PF విత్‌డ్రాలో కీలక మార్పులను తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. అయితే తాజాగా మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. EPFO (ఎంప్లాయిస్‌ ప్రామిడెంట్‌ ఫండ్ ఆర్గనైజేషన్‌) అడ్వాన్స్‌డ్‌ క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్‌ లిమిట్‌ను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. గత వారం సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ లిమిట్‌ను పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీన్ని CBT కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ఫలితంగా ప్రస్తుతం ఈ అడ్వాన్స్‌డ్‌ క్లెయిమ్‌ల లిమిట్‌ లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో PF నగదును అనారోగ్య కారణాలతోనే విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉండేది. అనంతరం విద్య, వివాహం, ఇంటి నిర్మాణం వంటి అదనపు ఆప్షన్‌లు కూడా ఇచ్చారు.

EPFO

EPFO 2020 సంవత్సరంలో ఆటో క్లెయిమ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యానికి సంబంధించిన సందర్భాల్లో గరిష్ఠంగా రూ.50000 వరకు ముందస్తు క్లెయిమ్‌లను తీసుకొచ్చింది. అనంతరం గత సంవత్సరం ఈ లిమిట్‌ను రూ.1 లక్ష వరకు పెంచారు. ఈ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచనున్నారని తెలుస్తోంది.

PF విత్‌డ్రా విధానంలో త్వరలో భారీ మార్పులను తీసుకురానున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో PF నగదును విత్‌డ్రా చేసేందుకు అవకాశం ఉంది. అయితే మే నెల చివరి నాటికి మరియు జూన్‌ నుంచి ATM, UPI ద్వారా ఈ నగదును తీసుకొనేందుకు అవకాశం కలగనుంది.

కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా ఈ వివరాలను గత నెల చివర్లో వెల్లడించారు. PF నగదును ATM, UPI ద్వారా విత్‌డ్రా చేసుకొనే వెసులుబాటుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని తెలిపారు.

ఈ సంవత్సరం మే నెల లేదా జూన్‌ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సుమిత్రా దావ్రా తెలిపారు. దీంతోపాటు PF ఖాతాల్లో ఎంత నగదు ఉందో కూడా UPI ద్వారా తనిఖీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి ATM, UPI ద్వారా గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని సుమిత్రా దావ్రా వెల్లడించారు. EPFO డిజిటలైజేషన్‌లో 120 పైగా డేటాబేస్‌లను ఇంటిగ్రేట్‌ చేసినట్లు తెలిపారు.

గతంలో PF విత్‌డ్రా సమయం 10 రోజుల కంటే ఎక్కువ ఉండేది. అయితే ప్రస్తుతం 3 రోజుల్లోనే విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం 95 శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ విధానంలో జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి సుమిత్రా దావ్రా తెలిపారు.

PF నగదును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో EPFO ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో EPFO వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. గతంలో ఇలాంటి క్లెయిమ్‌లు క్లియర్‌ అయ్యేందుకు అధిక సమయం పట్టేది. కరోనా సహా అనంతర సమయాల్లో తక్కువ రోజుల్లోనే క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Union Government of india likely to raise EPFO claim amount limit one lakh to five lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X