ఈ యాప్ మీరు డౌన్‌లోడ్ చేశారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. సైబర్ డోస్త్ ఏం చెబుతోందంటే?
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇటీవల SBI వినియోగదారులు మరియు స్మార్ట్ ఫోన్ యూజర్లకు మోసపూరిత లావాదేవీలపై అప్రమత్తం చేసింది. ఫేక్ SMS స్కాంపై ఇటీవల హెచ్చరికలు జారీచేసింది.
వినియోగదారులు తమ పాన్ వివరాలు అప్‌చేయాలని లేకుంటే SBI Yono యాప్ ఖాతాలు బ్లాక్ కానున్నాయనే నకిలీ మెసెజ్ వైరల్ అయింది. అయితే దీనిపై ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ తరహా మెసెజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు X ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేసింది.

దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ల యూజర్ల బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేసేందుకు రూపొందించిన ప్రమాదకర యాప్‌ల గురించి హెచ్చరించింది. కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ సెక్యురిటీ, సైబర్ సెక్యూరిటీ అవగాహనకు సంబంధించిన సోషల్‌మీడియా హ్యాండిల్ సైబర్ దోస్త్ నుంచి ఈ హెచ్చరికలను వెలువడ్డాయి.
దీంతోపాటు యూనియన్ బ్యాంకు పేరుతో నకిలీ యాప్ Union-Rewards.apk రూపొందించి, వినియోగదారులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు చేసిన ప్రయత్నాలపై సైబర్ దోస్త్ అప్రమత్తం చేసింది. ఈ యాప్ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. మరియు నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల నుంచి కూడా గణనీయమైన ముప్పు ఉందని తెలిపింది ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది.
వీరితోపాటు ఐఫోన్ యాజర్లను ఈ నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్‌లపై అప్రమత్తం చేసింది. Insecg, Chs-ses, Saai, Sequoia, Goomi వంటి యాప్‌లను ప్రమాదరమైనవిగా తెలిపింది. ఈ యాప్‌లు సెబీ SEBI- సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్టర్ కాలేదని పేర్కొంది.
అయితే మోసపూరిత సిఫార్సులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు cyber dost పేర్కొంది. ఇటువంటి యాప్‌లలో పెట్టుబడి పెట్టేవారిని సెబీ (SEBI) కూడా అప్రమత్తం చేసింది. సెబీలో రిజిస్టర్ కాని సంస్థల సోషల్ మీడియా వేదికలు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లలో చేరొద్దని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం మరో సైబర్ సెక్యురిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-In) కూడా ఇటువంటి హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇటీవలే పబ్లిక్ వైఫైల వినియోగం సమయంలో ఈ టీం కీలక సూచనలు చేసింది. పబ్లిక్ ప్రాంతాల్లో వైఫైని ఉపయోగించే సమయంలో ధ్రువీకరణ ముఖ్యమని పేర్కొంది. దీంతోపాటు బ్యాంకు లావాదేవీలు మరియు ఇతర సున్నితమైన వివరాలను నమోదు చేయకపోవడం ఉత్తమమని సూచించింది.
షాపింగ్ మాల్స్, ఎయిర్ పోర్ట్‌లు, హోటళ్లలు సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ వైఫై ని వినియోగించే ముందు వైఫై పేరు సహా ఇతర వివరాలను అక్కడున్న సిబ్బంది ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది.
అదనపు భద్రత కోసం వైఫై సెట్టింగ్స్‌లోని ఆటో కనెక్ట్ ఆప్షన్ ఆఫ్ చేయడం ఉత్తమం. దీంతోపాటు ఎక్కువగా పబ్లిక్ వైఫై ని వినియోగిస్తున్న వారు ఫోన్‌లోని యాంటీ వైరస్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మెరుగైన భద్రతను పొందవచ్చు. లేకుంటే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు ముఖ్యంగా ఓపెన్ నెట్‌వర్ లేదా పబ్లిక్ వైఫైని వినియోగిస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు బ్యాంకు లావాదేవీలు నిర్వహించకపోవడం ఉత్తమం మరియు సున్నితమైన సమాచారాన్ని వెబ్‌సైట్‌లలో నమోదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ వైఫైను ఉపయోగించాలి. వైఫై ద్వారా మీ పరికరాల్లోకి మాల్‌వేర్‌ను పంపి, నేరగాళ్ల నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








