కేంద్ర వార్షిక బడ్జెట్.. డేటా సెంటర్లకు ఏకంగా ట్యాక్స్ హాలిడే, రైతుల కోసం స్మార్ట్ సర్వీసులు..!
Union Budget 2026-27 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అనేక రంగాలపై కీలక ప్రకటనలు చేశారు. ఏకంగా రూ.53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సుమారు 80 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లను కేటాయించింది. దీంతోపాటు ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, విద్య, ఉద్యోగ, వ్యవసాయం కోసం ఉపయోగించడం. రైతుల కోసం భారత్ విస్తార్ ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రైతుల కోసం స్మార్ట్ సేవలు :
రైతులకు వర్షాభావం, తెగుళ్లు గురించి సమాచారం అందించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా రైతులకు స్మార్ట్, డేటా ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు తమ భాషలనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒకే పంటపై రైతులు ఆధారపడకుండా, ప్రాంతానికి, సీజన్‌కు తగిన పంటలు పండించేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
ట్యాక్స్ హాలీడే :
దీని వల్ల రైతుల ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతోపాటు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేశారు. ఏకంగా 2047 వరకు ట్యాక్స్ హాలీడే ప్రకటించారు. దీంతో క్లౌడ్ సర్వీసులు అందించే సంస్థలకు భారీ ప్రయోజనం కలగనుంది.
మొబైల్స్, ట్యాబ్లెట్స్ ధరలు తగ్గుతాయ్! :
లగ్జరీ వాచ్‌ల ధరలు పెరగనున్నాయి. దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ఈవీ బ్యాటరీల తయారీని వినియోగించే 35 అదనపు క్యాపిటల్ గూడ్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీకి వినియోగించే 28 రకాల పరికరాలపై కస్టమ్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గి.. ఫలితంగా ఈవీ బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్ కాస్త తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి.
సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లను కేటాయించారు. దిగుమతులపై ఆధారపడడాన్ని కట్టడం చేయడం, ప్రపంచ స్థాయి సంస్థలకు ఆకర్షించడం సహా సెమీకండక్టర్ల రంగంలో భారత్‌ను బలమైన కేంద్రంగా నిలపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నిధులు కేటాయింపులు చేశారు.


Click it and Unblock the Notifications






