Home
News

FASTAG ఆధారిత వార్షిక పాస్ పై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. ఎవరికి ఉపయోగం అంటే..?

జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఫాస్టాగ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్‌ తో చాలా వరకు హైవేలపై పరిస్థితిలో మార్పు వచ్చింది. ఫాస్టాగ్‌ ను ఎవరికి వారే సులభంగా రీఛార్జ్‌ చేసే అవకాశం కూడా ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. X పోస్ట్‌ ద్వారా వివరాలు అందించారు.

ఆధారిత వార్షిక టోల్‌ పాస్‌ :
జాతీయ రహదారులపై రాకపోకలు మరింత సక్రమంగా సాగేలా తాజాగా కీలక ప్రకటన వెలువడింది. ఫాస్టాగ్‌ (FASTAG) ఆధారిత వార్షిక టోల్‌ పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.3000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా నేషనల్‌ హైవేలపై మరింత సజావుగా ప్రయాణం సాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Union minister nitin gadkari announces fastag based annual pass here are the full details

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? :
ఈ ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక టోల్‌ పాస్‌ విధానం ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పాస్‌ కోసం రూ.3000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పాస్‌ యాక్టివేట్‌ అయిన నుంచి సంవత్సరం లేదా 200 ట్రిప్పులు వరకు జాతీయ రహదారులపై ప్రయాణాలు చేయవచ్చని తెలిపారు.

త్వరలో యాక్టివేషన్‌ కోసం లింక్‌ :
కార్లు, వ్యాన్‌లు, జీప్‌లు వంటి నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఈ వార్షిక టోల్‌ పాస్‌ జారీ చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పాస్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు వీలుగా ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాజ్‌మార్గ్‌ యాప్‌, NHAI, MoRTH వెబ్‌సైట్‌లో ఈ లింక్‌ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఎవరికి ఉపయోగపడుతుంది ? :
జాతీయ రహదారుల పైన ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఈ వార్షిక టోల్‌ పాస్‌ వ్యవస్థ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారులపైన తరచూ ప్రయాణం చేసే వారికి ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

ఒకేసారి చెల్లింపులు చేసే వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల వాహనదారులు సజావుగా ప్రయాణం సాగించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 60 కి.మీ పరిధిలోని టోల్‌ప్లాజాల సమస్య పరిష్కారం కానుంది. మరియు టోల్‌ప్లాజాల వద్ద వివాదాలు తగ్గుముఖం పడతాయన్నారు.

Take a Poll

సామాన్యులపై తగ్గనున్న భారం :
ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక టోల్‌ పాస్‌ విధానం ద్వారా సామాన్యులపై ఆర్థిక భారం తగ్గనుంది. మరియు లక్షలాది మంది వాహనదారులు సాకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ విధానం దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమల్లోకి రానుంది.

ఫాస్టాగ్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? :
దేశంలో తొలిసారిగా 2016 లో జాతీయ రహదారులపైన ఉన్న కొన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం క్రమంగా విస్తరించింది. 2021 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Best Mobiles in India

English summary
Union minister nitin gadkari announces fastag based annual pass here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X