BSNL 5G నెట్‌వర్క్ ఎప్పుడు ప్రారంభం కానుందో చెప్పేసిన కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా..!!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL యూజర్లకు కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు. ఇప్పటికే 4G నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా పనిచేస్తున్న BSNL.. 5G నెట్‌వర్క్‌ను (BSNL 5G services Launch Date) కూడా లాంచ్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలకు టెలికాం శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా కీలక ప్రకటన చేశారు. యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టన్‌షిప్ ఫోరమ్ ITUWTSAలో పాల్గొన్ని సింథియో వివరాలను వెల్లడించారు.
చాలా కాలంలో BSNL 4G సేవల కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకోసం దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 13 నాటికి దేశవ్యాప్తంగా 38,300 టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్లు ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జోతిరాదిత్య సింధియా చెప్పారు.

అయితే BSNL 5G సేవలకు సంబంధించిన సన్నాహకాలు ఇప్పటికే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2025 జూన్ నాటికి BSNL 5G నెట్‌వర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. 5G సేవలు ప్రారంభం అయితే సొంత నెట్‌వర్క్ ద్వారా సేవలు అందించనున్న 6వ దేశంగా నిలుస్తామని చెప్పారు.
ప్రభుత్వరంగ టెలికాం ప్రొవైడర్ ఇతర సంస్థలపై ఆధారపడకూడదన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా స్వదేశీయంగానే టెక్నాలజీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం C-DOT మరియు TCS భాగస్వామ్యంతో 4G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 4G నుంచి సులభంగా 5G నెట్‌వర్క్‌కు మారేందుకు అవకాశం ఉందన్నారు.
ఆగస్టు ప్రారంభంలో BSNL 5G నెట్‌వర్క్ సేవల్ని కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా పరీక్షించారు. C-DOT క్యాంపస్ నుంచి 5G ద్వారా వీడియో కాల్ చేశారు. నెట్‌వర్క్ పనితీరుపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అప్పట్లోనే కేంద్ర మంత్రి షేర్ చేశారు.
అయితే BSNL కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో టెలికాం రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర సంస్థల కోసం రూ.1.28 లక్షల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో BSNL టెక్నాలజీ అప్‌గ్రేడ్ మరియు పునర్నిర్మాణం కోసం రూ.82.916 కోట్లు కేటాయించారు.
దీంతోపాటు జులైలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో. ఎయిర్‌టెల్, వోడాఫోన్- ఐడియా ఛార్జీలు పెంచాయి. దీంతో భారీగా BSNL వైపు యూజర్లు మొగ్గుచూపుతున్నారు. పోర్టింగ్ సహా BSNL కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు ఇతర సంస్థలతో పోలిస్తే BSNL తక్కువ ధరకే మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
దీంతోపాటు ఈ అక్టోబర్ 1 న వార్షికోత్సవం నిర్వహించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి 24 వరకు.. అనేక రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు డేటాను అందిస్తోంది. ఏకంగా 24GB డేటాను అందిస్తోంది. ఈ అదనపు డేటా వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు దీపావళి ఆఫర్‌లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపును అందిస్తోంది. మూడు నెలలపాటు ఈ ఆఫర్ ఉంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications








