చైనా అమెరికా మధ్య గొడవ ముదురుతోంది! టెలికామ్ కంపెనీ లైసెన్స్ రద్దు చేసిన అమెరికా ..!

By Maheswara
|

యుఎస్‌లోని రెగ్యులేటర్లు బుధవారం చైనీస్ ప్రభుత్వ యాజమాన్యంలోని పసిఫిక్ నెట్‌వర్క్‌ల టెలికమ్యూనికేషన్ లైసెన్స్‌ను రద్దు చేసారు. అమెరికా, చైనాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలో చైనా వ్యాపారాలకు ఇది తాజా దెబ్బ. వాషింగ్టన్ గతంలో చైనా టెలికాం మరియు చైనా యునికామ్ అనుమతులను ఉపసంహరించుకుంది మరియు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఇప్పుడు పసిఫిక్ మరియు దాని అనుబంధ సంస్థ ComNet సేవలను కూడా తగ్గించడానికి 60 రోజుల గడువు ఇచ్చింది.

 

FCC  ప్రకటనలో

FCC ప్రకటనలో

"చైనీస్ ప్రభుత్వం ప్రోత్సహించబడుతున్న కంపెనీల యాజమాన్యం మరియు నియంత్రణ గణనీయమైన జాతీయ భద్రత మరియు చట్ట అమలు లో ప్రమాదాలను పెంచుతాయి" అని FCC ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా ప్రోత్సాహము కారణంగా సంస్థలు US కమ్యూనికేషన్‌లను పర్యవేక్షించవచ్చు లేదా అంతరాయం కలిగించవచ్చు అని అనుమానం వ్యక్తపరిచారు. ఈ వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు ComNet వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వలేదు.

 

ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాల లో విభేదా

ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాల లో విభేదా

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనుగుణంగా చైనాను విస్తృతంగా ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు సాగడంతో పసిఫిక్ ఆపరేటింగ్ అధికారం రద్దు చేయబడింది, ఈ విధానం ఉద్రిక్తతలను పెంచింది. వాణిజ్యం, మానవ హక్కులు, తైవాన్ సమస్య మరియు కోవిడ్-19 మహమ్మారితో సహా బహుళ రంగాలలో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాల లో విభేదాలు నెలకొన్నాయి.

చైనా టెలికాం చైనా యొక్క అతిపెద్ద ఫిక్స్‌డ్-లైన్ ఆపరేటర్, అయితే ఇది యునైటెడ్ స్టేట్స్‌లో సంవత్సరాల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, వాణిజ్యం విషయంలో బీజింగ్‌తో అతని పరిపాలనలో పదేపదే ఘర్షణ పడింది. టెలికాం కంపెనీలు పరిమితులకు వ్యతిరేకంగా పోరాడాయి, చైనా యునికామ్ జనవరిలో ఒక ప్రకటనలో ఎఫ్‌సిసి నిర్ణయం "ఎటువంటి సమర్థనీయమైన ఆధారాలు లేకుండా మరియు అవసరమైన ప్రక్రియ లేకుండా ఉంది " అని పేర్కొంది.

భారత్ vs చైనా
 

భారత్ vs చైనా

ఇది ఇలా ఉండగా హిమాలయాలలో చైనా దురాక్రమణకు నిరసనగా భారత ప్రభుత్వం కూడా వాణిజ్య పరంగా కఠిన చర్యలు తీసుకున్న సంగతి మీకు తెలిసిందే.వీటిలో భద్రతాపరమైన ముప్పును చూపుతూ భారతప్రభుత్వం మరో 54 చైనీస్ యాప్‌లను నిషేధించడం ప్రముఖమైనది. ఇక 54 చైనీస్ యాప్‌ల యొక్క పూర్తి సమాచారం విషయానికి వస్తే అధికంగా బ్యూటీ కెమెరా యాప్‌లు ఉన్నాయి. స్వీట్ సెల్ఫీ హెచ్ డి, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, ఈక్వాలైజర్ & బాస్ బూస్టర్, సెల్ఫ్ ఫోర్స్ క్యామ్ కార్డ్, ఐసోలాండ్ 2- యాసస్ అఫ్ టైం ల్యాండ్, వివా వీడియో ఎడిటర్, టెనెంట్ ఎక్సరివర్, ఓమియోజి అరీనా, అప్యోజి చెస్, డ్యూయల్ స్పేస్ లైట్ వంటివి మరిన్ని ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది జూన్ లో విస్తృతంగా ఉపయోగించే టిక్ టాక్, వీచాట్, హెల్లొ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలతో సహా మరో 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్ లను కూడా నిషేదించింది.

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గతంలో తొలగించిన చైనీస్ యాప్ ల వివరాలు

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గతంలో తొలగించిన చైనీస్ యాప్ ల వివరాలు

భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు గతంలో తొలగించిన చైనీస్ యాప్ లలో టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, UC న్యూస్, UCబ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో యాప్, లైక్, క్వాయ్, రోమ్‌వే, షీన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, APUS బ్రౌజర్, VivaVideo-QU వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, CM బ్రౌజర్ మరియు వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్) వంటివి ఉన్నాయి. చైనా యొక్క యాప్ లు కొన్ని పెద్ద మొత్తంలో ప్రజల యొక్క ప్రైవేట్ డేటాను సేకరిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలపడంతో తొలగించారు.

Best Mobiles in India

English summary
United States Cancels Chinese Telecom Company License. Full Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X