యూనివర్సిటీ విద్యార్దులకు 'ఆకాష్' ఫ్రీ..

Posted By: Prashanth

యూనివర్సిటీ విద్యార్దులకు 'ఆకాష్' ఫ్రీ..

 

మీరు యూనివర్సిటీలో లేదా కాలేజీలో చదువుకుంటున్నారా.. ఐతే తొందరలో మీకు ప్రపంచపు అతి తక్కువ ఖరీదు కలిగిన ఆకాష్ టాబ్లెట్ ఫ్రీగా లభించనుంది. ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ, కాలేజీలలో చదివే విద్యార్దులకు ఆకాష్ టాబ్లెట్‌ని ఫ్రీగా ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై కమ్యూనికేషన్స్ & ఐటి మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ ఆకాష్ టాబ్లెట్‌ని విద్యార్దులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బెంగళూరులో జరిగిన సెమీ కండెక్టర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వం ఈ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్‌ని విద్యార్దులకు పంచే భాగంలో ఈ నిర్ణయం తీసుకందన్నారు. కపిల్ సిబల్ మాట్లాడుతూ టాబ్లెట్ ఖరీదు రూ 1500 కాగా... ఇందులో సగ భాగం అంటే రూ 750 లను కేంద్ర ప్రభుత్వం భరించగా మిగతా సగ భాగాన్ని విద్యాసంస్దలే భరించనున్నాయి. దీనిని బట్టి విద్యార్దులకు ఈ టాబ్లెట్ ఉచితంగా అందజేస్తున్నామాట.

భారతదేశంలో ఈ టాబ్లెట్ ఉత్పత్తి సులభతరం చేయడానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను రూపొందించి, ఒక పర్యావరణ వ్యవస్థ తయారు చేసింది. ఇదే టాట్లెట్‌ని బయట కొనుగోలుదారులు కొనుగోలు చేయాలంటే దీని ఖర్చు 2,500 గా రూపాయలు ఉంటుంది. తక్కువ ఖరీదు కలిగిన ఆకాష్ టాబ్లెట్‌ని ఇండియా అక్టోబర్ 2011లో అధికారకంగా ప్రకటించింది. ఆకాష్ టాబ్లెట్ ఇండియాలోకి రావడం వల్ల డిజిటల్ ప్రపంచంలో కొన్ని సమూల మార్పులు వచ్చాయి. డిసెంబర్ నుండి కూడా ఆకాష్ ముందస్తు ఆర్డర్స్ మొదలయ్యాయి.

ఆకాష్ ప్రత్యేకతలు:

హార్డ్ వేర్:

* ప్రాసెసర్: 366 Mhz. Connexant with Graphics accelerator and HD Video processor

* మెమరీ(RAM): 256MB RAM / Storage (Internal): 2GB Flash

* స్టోరేజి(External): 2GB to 32GB Supported

* ఆడియో: 3.5mm jack / Audio in: 3.5mm jack

* డిస్ ప్లే: 7″ display with 800×480 pixel resolution

* ఇన్ పుట్: Resistive touch screen

* కనెక్టివిటీ & నెట్ వర్కింగ్: GPRS and WiFi IEEE 802.11 a/b/g

* పవర్ & బ్యాటరీ: Up to 180 minutes on battery. AC adapter 200-240 volt range.

సాప్ట్ వేర్:

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2

* Supported Document formats: DOC, DOCX, PPT, PPTX, XLS, XLSX, ODT, ODP

* PDF viewer, Text editor

* Multimedia and Image Display

* Image viewer supported formats: PNG, JPG, BMP and GIF

* Supported audio formats: MP3, AAC, AC3, WAV, WMA

* Supported video formats: MPEG2, MPEG4, AVI, FLV

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot