ఎలక్ట్రానిక్ వస్తువులను ఉరుములు, మెరుపులు నాశనం చేస్తాయా ?
మీకు మెరుపులు ఎలా వస్తాయో తెలిసే ఉంటుంది.ఈ మెరుపుల వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కసారిగా వచ్చిన మెరుపులతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోవడం కూడా జరుగుత
మీకు మెరుపులు ఎలా వస్తాయో తెలిసే ఉంటుంది.ఈ మెరుపుల వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కసారిగా వచ్చిన మెరుపులతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనం డాబా పైన కూర్చుని ఉన్నప్పుడు మెరుపులు వస్తే ఇక అంతే సంగతులు, ఒక్కసారిగా గుడ్డి వారు అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఈ మెరుపులు నుంచి వచ్చే కాంతి అంత పవర్ పుల్ గా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. మెరుపుల నుండి అలాంటి వెలుతురు ఎలా వస్తుంది. గాడ్జెట్లు ఎందుకు అలా కాలిపోతాయి వీటిపై ఓ లుక్కేయండి.

నిజమేంటి
Department of Homeland Security ప్రకారం మెరుపుల నుంచి వచ్చే కాంతి మాములు కాంతి కన్నా అధిక రెట్లు ఉంటుంది. అది కరెంట్ స్థంబాన్ని తాకినప్పుడు ఆ మెరుపుల నుండి వచ్చే వెలుతురు వైర్లను ఒక్కసారిగా షేక్ చేస్తుంది. మాములుగా 120 volts ఉండే పవర్ మెరుపులు తాకితే 169 voltsకి పెరుగుతుంది. ఒక్కసారిగా ఇలా పెరగడం వల్ల గాడ్జెట్లు ఆ పవర్ ని తట్టుకోలేవు.

జాగ్రత్త
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉరుములతో కూడిన తుఫాను వస్తున్నప్పుడు వెంటనే మీరు మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు పవర్ నీ తీసేయడం ఉత్తమం.

పవర్ కట్
ఉరుములతో కూడిన తుఫాను వస్తున్నప్పుడు మీ ఇంట్లోకి నేరగా కరెంట్ వైర్ల ద్వారానే పవర్ అధికంగా సప్లయి అవుతుంది. ఒక్కసారిగా వచ్చని ఆ పవర్ ధాటికి మీ ఇంట్లో ఉన్న గాడ్జెట్లు పేలిపోతాయి. ఎందుకంటే అవి ఆ స్థాయి వోల్టేజిని తట్టుకోలేవు.

డెరెక్ట్ లింక్
మీరు వీలైనంత వరకు మీ ఇంట్లో ఉన్న గాడ్జెట్లకు నేరుగా పవర్ కనెక్ణన్ ఇవ్వకుండా స్టెబిలేజర్ లాంటివి వాడాలి. అవి వాడటం వల్ల పవర్ ముందుగా స్టెబిలేజర్ ని తాకుతుంది కాబట్టి గాడ్జెట్ల సురక్షితంగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








