పోలీసులకు పాకిన టిక్‌టాక్‌, వరసగా సస్పెండ్

By Gizbot Bureau
|

టిక్‌టాక్‌ మోజుతో యువత ఎంతకైనా వెనుకాడట్లేదు. లైక్స్ ఎక్కువగా సంపాదించుకోవాలనే కోరికతో సాహసాలకు తెగబడుతున్నారు. అయితే ఇది యువత వరకే పరిమితం కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పాకింది. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ సస్పెండ్‌ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్న ఖమ్మం.. నిన్న విశాఖ, కరీంనగర్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. ఇదేదో తెలుగు రాష్ట్రాలకే పరిమితమవ్వలేదు.. దేశవ్యాప్తంగానూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

UP Police SWAT team transferred after video of them wielding guns goes viral

పోలీసులు, అధికారులు కూడా ఆ మోజులో పడి... డ్యూటీలో ఉంటూ... రూల్స్ పక్కనపెడుతున్నారు. ఫలితంగా వారిపై యాక్షన్ తప్పట్లేదు.ఉత్తరప్రదేశ్‌లో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) అనే పోలీసుల టీమ్ ఒకటుంది. ఆ టీమ్ సభ్యులు డ్యూటీలో ఉంటూ ఆయుధాలు చూపిస్తూ టిక్ ‌టాక్‌లో ఓ వీడియో పెట్టారు. అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.

టిక్ ‌టాక్‌లో పెట్టిన వీడియో

టిక్ ‌టాక్‌లో పెట్టిన వీడియో

డ్యూటీలో ఉంటూ ఆయుధాలు చూపిస్తూ టిక్ ‌టాక్‌లో పెట్టిన వీడియో ఉన్నతాధికారుల కంట పడింది.దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ముఖ్యంగా ఆయుధాల్ని చూపిస్తూ వీడియో చేసినందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.మొత్తం స్వాత్ టీమ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేశారు. బస్తీ పోలీసులుగా చెప్పుకునే వాళ్లు మాక్ ఎన్‌కౌంటర్లలో ఆ ఆయుధాల్ని ఉపయోగిస్తారు. వాటిని ప్రజలకు చూపించడం నేరమని అధికారులు చెబుతున్నారు.

డీజీపీ OP సింగ్ ఆగ్రహం

డీజీపీ OP సింగ్ ఆగ్రహం

అలా చేసినందుకు డీజీపీ OP సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీంలోని ఐదుగురు సభ్యులనూ ట్రాన్స్‌ఫర్ చేసి ఆ వీడియోపై దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు.ప్రొఫెషనల్‌గా ఉండాల్సిన వారు రూల్స్ తప్పితే క్షమించేది లేదన్న ఓపీ సింగ్ ఇలా ఆయుధాల్ని వీడియోల్లో చూపిస్తే... ప్రజల్లో లేని పోని భయాందోళనలు కలుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే టీమ్‌లోని ఓ పోలీస్ ఆ వీడియోని అప్ లోడ్ చేశారు.

 హర్యాన్వీ సాంగ్ బ్రాక్‌గ్రౌండ్‌లో ప్లే

హర్యాన్వీ సాంగ్ బ్రాక్‌గ్రౌండ్‌లో ప్లే

అందులో స్వాత్ టీమ్ పొలాల్లో నడుస్తూ తమ ఆయుధాల్నీ, గన్స్‌నీ చూపించింది. రెండు నిమిషాల ఆ వీడియోలో హర్యాన్వీ సాంగ్ బ్రాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యింది.ఇదిలా ఉంటే విశాఖలో కూడా పోలీసులు ఇలాగే విధుల్లో ఉంటూ ట్విట్టర్‌లో వీడియో చెయ్యడంతో పై అధికారులు వాళ్లను సస్పెండ్ చేశారు. ఇలా చాలా చోట్ల టిక్ టాక్ వల్ల కంట్రోల్ తప్పుతున్న అధికారులు అడ్డమైన వీడియోలు చేసి బుక్కవుతున్నారు.

ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను

ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను

తాజాగా గుజరాత్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు.రాజ్‌కోట్‌లో విధి నిర్వహణను పక్కన పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పోలీస్‌ శాఖకు చెందిన పీసీఆర్‌ వ్యాన్‌ నడుపుతూ ఓ కానిస్టేబుల్‌, ఆ వాహనం ముందు భాగంలో కూర్చుని మరో కానిస్టేబుల్‌ టిక్‌టాక్‌ వీడియో చేశారు. సినిమాల్లో హీరోలను అనుకరిస్తూ చేసిన ఈ వీడియో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 45 రోజుల క్రితమే ఈ వీడియో తీసినప్పటికీ.. తాజాగా వెలుగులోకి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

Best Mobiles in India

English summary
UP Police SWAT team transferred after video of them wielding guns goes viral

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X