స్కామ్‌ల వల్ల యుపిఎ గవర్నమెంట్ 'ఐటి సపోర్ట్' కొల్పోనుందా..

Posted By: Staff

స్కామ్‌ల వల్ల యుపిఎ గవర్నమెంట్ 'ఐటి సపోర్ట్' కొల్పోనుందా..

న్యూఢిల్లీ: నవంబర్ 1వ తారీఖున విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెసు ప్రతినిధి మనీష్ తివారి చాలా ఘాటుగానే స్పందించారు. అసలు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి సత్యం లేదని అన్నారు. మనీష్ తివారి ఇంతలా మాట్లాడడానికి అసలు అజీమ్ ప్రేమ్‌‍‌జీ ఏమన్నారంటే 'ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా అసంభద్దంగా ఉంటున్నాయని' అన్నారు.

ఈ మాటలపై మనీష్ తివారి అసలు అజీమ్ ప్రేమ్‌జీ యుపిఎ గవర్నమెంట్‌పై ఏ ఏరియాని ఉద్దేశించి అన్నారో మాత్రం అర్దం కావడం లేదని తివారి స్ఫష్టం చేశారు. ఐతే అజీమ్ ప్రేమ్‌జీ మాత్రం ఇటీవల యుపిఎ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌ల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. స్కామ్‌ల పై యుపిఎ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొవడంలో అలసట వహిస్తుందని తెలిపారు. దేశీయ మూడవ అతి పెద్ద సాప్ట్ వేర్ దిగ్గజం చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు మనీష్ తివారి కూడా కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకొవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందుకు కారణం జాతీయంగా, అంతర్జాతీయంగా వాటి ప్రభావం దేశం మీద చూపించడమే కాకుండా, సోషల్‌గా, ఎకనామికల్‌గా ప్రభావం చూపుతుందని అన్నారు. అన్నా హాజార్ ఉద్యమ నేపద్యంలో ఇన్పోసిస్ నారాయణ మూర్తి కూడా యుపిఎ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి చూస్తుంటే దేశంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీ ప్రముఖులు నెమ్మదిగా యుపిఎ గవర్నమెంట్‌కి దూరమవుతున్నారని తెలుస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting