2018లో ఐఫోన్ X లాంటి మూడు ఐఫోన్స్ లాంచ్!

బ్యాటరీ బ్యాక్ అప్ ఎక్కువగా ఉంటుంది.

By Madhavi Lagishetty
|

యాపిల్ కంపెనీ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఐఫోన్ X ఇప్పటికే సక్సెస్ క్రెడిట్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరో మూడు ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేసేందుకు యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

 
Upcoming Apple iPhones will feature significantly larger batteries

KGI సెక్యూరిటీస్ కి చెందిన యాపిల్ అనాలసిస్టు కుయో...రాబోయో ఐఫోన్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది లాంచ్ కానున్న ఐఫోన్లు, 6.1అంగుళాల OLED డిస్ల్పేతోపాటు LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇవి ఐఫోన్ X ను పోలి ఉంటాయని ...ఫీచర్లు కూడా అదేస్థాయిలో ఉండవచ్చని కుయ్ తెలిపారు.

2018లో లాంచ్ కానున్న ఐఫోన్లు బ్యాటరీ కాలపరిమితి ఎక్కువగా ఉండనుంది. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో ఛార్జింగ్ నిలవడం లేదని...మొబైల్ స్విచాఫ్ అవుతుందని యూజర్లు ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా చేశారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న యాపిల్ కంపెనీ...వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్న ఫోన్లలో సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తోంది. మింగ్ చి కుయో మాట్లాడుతూ అప్ గ్రేడ్ 3డి సెన్సింగ్ మరియు AR సంబంధిత ఫంక్షన్లను భవిష్యత్తులో రానున్న ఐఫోన్లలో రాకుండా చూడాలి.

 

అయితే స్పెక్స్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. టెక్నాలజీ అనేది రోజురోజుకూ అప్ డేట్ అవుతుండటంతో బ్యాటరీ బ్యాక్ అప్ ఎక్కువగా ఉండాలి. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకునే రాబోయో రోజుల్లో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ కాలం ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

మార్కెట్లోకి Oppo కొత్త స్మార్ట్‌ఫోన్‌లుమార్కెట్లోకి Oppo కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ xలో ఒక కొత్త డిజైన్ లో బ్యాటరీని రూపొందించారు. ఇది L ఆకారంలో రెండు వేర్వేరు విభాగాలను ఒకదానితో ఒకట కనెక్ట్ చేయడానికి సపోర్టు చేస్తుంది. మింగ్ చి కుయో తెలిపిన వివరాల ప్రకారం లాజిక్ బోర్డు లేఅవుట్ కోసం ఒక ఆప్షన్ను ఇచ్చినట్లు సూచిస్తుంది.

ఇక యాపిల్ ఐఫోన్స్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ను కలిగి ఉంటాయి. వీటితోపాటు ఫేస్ రికగ్నైజ్ ఫీచర్ తో వస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Apple will need to employ bigger batteries in its future iPhones for powering the "upgraded 3D sensing and AR-related functions."

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X