డిస్కౌంట్లు, ఆఫర్లకు ఇదే చివరి అవకాశం, ఇకపై కష్టమే !

|

కొనుగోలుదారులు తమకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేసేందుకు ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ధర తగ్గేదాకా ఎదురుచూసి ఆ తరువాత కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పండగ సీజన్లలో సైతం ఫోను తగ్గినా కొనరు. ఎందుకంటే మళ్లీ పండగ దాకా ఎదురుచూస్తుంటారు. ఇక ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, అప్లియెన్స్‌, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట.వచ్చే దివాళి సేల్‌ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకో ఓ లుక్కేసుకోండి.

 

డ్యూయల్ సిమ్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు ఇవే |

వచ్చే పండగ సీజన్‌ తర్వాత..

వచ్చే పండగ సీజన్‌ తర్వాత..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్‌ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్‌ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు..

స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు..

షియోమి, హానర్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, ఆసుస్‌ వంటి స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్‌ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.

పానాసోనిక్‌, బోస్‌, బీఎస్‌హెచ్‌ ఎలక్ట్రానిక్స్‌..

పానాసోనిక్‌, బోస్‌, బీఎస్‌హెచ్‌ ఎలక్ట్రానిక్స్‌..

వైట్‌ గూడ్స్‌ తయారీదారులు పానాసోనిక్‌, బోస్‌, బీఎస్‌హెచ్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా పండగ సీజన్‌ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి.

రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో..
 

రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో..

రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్‌ అకౌంట్‌ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్‌ డ్యూటీని పెంచింది.

ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ..

ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ..

రిగ్గా పండగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు.

ఈ పండగ సీజన్‌ వరకు..

ఈ పండగ సీజన్‌ వరకు..

ఈ పండగ సీజన్‌ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్‌ ‌అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

సేల్స్‌ వాల్యుమ్‌ పెంచేందుకు..

సేల్స్‌ వాల్యుమ్‌ పెంచేందుకు..

రూపాయి క్షీణతతో సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్‌ వాల్యుమ్‌ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం' అని హువాయి, హానర్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ సంజీవ్‌ తెలిపారు.

 ఈ ఏడాది ముగింపు నాటికి ..

ఈ ఏడాది ముగింపు నాటికి ..

వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్‌ప్లస్‌, షియోమి తెలిపాయి. ఈ పండగ సీజన్‌ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Upcoming Diwali sale might be your last chance to get massive discounts on smartphones, electronics more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X