మార్కెట్‌ని షేక్ చేసేందుకు త్వరలో దూసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్లు
2019లో దేశీయ మొబైల్ మార్కెట్ ని షేక్ చేసేందుకు టాప్ కంపెనీల ఫోన్లు దూసుకువస్తున్నాయి. చైనా దిగ్గజ కంపెనీలు అలాగే దక్షిణ కొరియా కంపెనీలు సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి ఈ ఏడాది ఫోన్లను తీసుకురాన
2019లో దేశీయ మొబైల్ మార్కెట్ ని షేక్ చేసేందుకు టాప్ కంపెనీల ఫోన్లు దూసుకువస్తున్నాయి. చైనా దిగ్గజ కంపెనీలు అలాగే దక్షిణ కొరియా కంపెనీలు సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి ఈ ఏడాది ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ సమ్మర్ లో కొన్నిఫోన్లు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు రెడీ కాగా మరికొన్ని ఫోన్లు ఈ ఏడాది ఆఖరున కనువిందుచేయనున్నాయి. వీటిల్లో చైనా కంపెనీ వన్ ప్లస్ కు చెందిన వన్ ప్లస్ 7 ప్రొ నాచ్ డిస్ ప్లేతో రానుంది. వన్ ప్లస్ మోడల్స్ లో ఈ ఫీచర్స్ తో రావడం ఇదే తొలిసారి. దీంతో పాటు ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టంతో ఈ ఫోన్లు అలరించనున్నాయి. 48MP, 20MP, and 16MP lensesతో ఈ ఫోన్లు రానున్నాయని సమాచారం.

అలాగే మోటో నుంచి మోటో జడ్ 4 కూడా అదిరిపోయే కెమెరాతో దూసుకురానుంది. సింగిల్ షూటర్ అలాగే లేజర్ ఆటో ఫోకస్ , డ్యూయెల్ టోన్ ఎల్ ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్ తో పాటుగా Motorola One Vision, Google Pixel 3a XL, OnePlus 7 Pro, and Google Pixel 3a వంటి ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నాయి. మరి ఈ ఏడాది దూసుకురానున్న ఫోన్లను ఓ సారి పరిశీలిస్తే..

OnePlus 7 Pro
రూమర్ స్పెసిఫికేషన్స్
వన్ ప్లస్ 7 ప్రొ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 48, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

Google Pixel 3a XL
రూమర్ స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్‌లో6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ , 4జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివ్ ఎడ్జ్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందివ్వనున్నారని తెలిసింది.

Motorola Moto Z4
మోటో జడ్4 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

OnePlus 7
రూమర్ స్పెసిఫికేషన్స్
6.2 ఇంచుల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9పై, ఆక్సిజన్ ఓఎస్ 9, Qualcomm SDM855 స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 48 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4150 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

Google Pixel 3a
రూమర్ స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్‌లో5.6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్ , 4జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివ్ ఎడ్జ్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందివ్వనున్నారని తెలిసింది.

Motorola One Vision
రూమర్ స్పెసిఫికేషన్స్
6.2 inches IPS LCD కెపాసిటివ్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 (Pie); ఆండ్రాయిడ్ వన్ ఆక్టోకోర్, 48 MPరేర్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా ,Non-removable Li-Po 3500 mAh battery


Click it and Unblock the Notifications








