నవంబర్ నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్ ఇదే!
భారత్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి అక్టోబర్ నెలలో అనేక ఫోన్లు విడుదల అయ్యాయి. గూగుల్ పిక్సల్ 8 సిరీస్, వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ మరియు వన్‌ప్లస్ 11R కొత్త వేరియంట్ విడుదల అయ్యాయి. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S23 SE, వివో V29 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నవంబర్‌లోనూ మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి.
రియల్‌మీ GT5 ప్రో 5G :ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 అంగుళాల 1.5k OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు కొత్త శక్తివంతమైన ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కెమెరా సహా 50MP +8MP కెమెరాలను కలిగి ఉంటుంది. అదే విధంగా ముందువైపు 32MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ నవంబర్‌లో చైనాలో విడుదల కానుంది. భారత్‌లో విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
రెడ్‌మీ నోట్ 13 సిరీస్: ఈసిరీస్ చైనాలో విడుదల అయింది. ఈనెలలో భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 6.67 అంగుళాల కర్వడ్ 1.5k అమోలెడ్ డిస్‌ప్లే సహా 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్ 16GB ర్యామ్, 512GB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుంది. 5120mAh బ్యాటరీతో రానుంది. 200MP ప్రైమరి కెమెరాతో వస్తుంది.
రెడ్‌మీ నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో రానుంది. మరియు 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్ఠంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండగా.. అందులో 200MP ప్రైమరీ కెమెరాను అమర్చారు.
రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ, 5000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. అందులో 108MP ప్రైమరీ కెమెరా సహా 2MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
vivo X100 సిరీస్ : ఈ సిరీస్‌లో X100, X100 ప్రో, X100 ప్రో+ స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. ఈ సిరీస్ టాప్ ఎండ్ వేరియంట్ వివో X100 ప్రో+ 6.78 అంగుళాల 2k OLED 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.
ఈ ఫోన్ వెనుక వైపు నాలుగు కెమెరాలను కలిగి ఉండనుంది. 50MP OIS + 50MP + 50MP + 200MP కెమెరాలను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ నవంబర్‌లో చైనాలో విడుదల కానుంది. భారత్ విడుదలపై ఇంకా స్పష్టత లేదు.
OnePlus 12 5G : స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 2k BOE OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 120W వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుకవైపు 50MP+ 50MP+ 64MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ చివర్లో చైనాలో విడుదల అయ్యే అవకాశం ఉంది. భారత్లో విడుదలపై స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications








