Aadhaar అప్‌డేట్ చేసుకున్నారా.. పదేళ్లు గడిచిన వారికి UIDAI సూచన!
ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరికీ Aadhaar కార్డు అనేది తప్పనిసరి అయింది. ఏ చిన్న దరఖాస్తు పెట్టుకోవాలన్నా ఆధార్ నంబర్ సమర్పించుకోవాల్సిందే. అయితే, తాజాగా ఈ Aadhaar కార్డుకు సంబంధించి UIDAI(యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఒక కీలక ప్రకటన చేసింది.

యూనిక్ ఐడీని పొంది పదేళ్లు గడిచిన వ్యక్తులు, అప్పటి నుంచి తమ వివరాలను అప్‌డేట్ చేయకపోతే ఆ ప్రక్రియను ఇప్పుడు పూర్తి చేసుకోవాలని కోరింది. గుర్తింపు మరియు నివాస రుజువు పత్రాల ద్వారా ఆధార్ కార్డు హోల్డర్‌లు తమ యునిక్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాలని UIDAI తెలిపింది. ఈ మేరకు UIDAI ఒక ప్రకటనలో వెల్లడించింది.

తప్పనిసరి అని పేర్కొనలేదు..
పది సంవత్సరాల క్రితం ఆధార్ గుర్తింపు నంబర్ పొంది ఉన్న వారు.. ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేషన్‌కు నోచుకోనట్లయితే.. అలాంటి వారు తమ డాక్యుమెంట్లతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని UIDAI కోరింది. కానీ, ఈ ప్రక్రియ తప్పనిసరి అని మాత్రం UIDAI ఎక్కడా పేర్కొనలేదు.

ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు:
ఆధార్ వివరాలకు సంబంధించిన అప్‌డేట్ ప్రక్రియ ఆన్‌లైన్‌తో పాటు, దగ్గరలోని ఆధార్ కేంద్రాలలో కూడా చేయవచ్చు అని నవీకరణ ఆన్‌లైన్‌తో పాటు ఆధార్ కేంద్రాలలో కూడా చేయవచ్చు అని ఆధార్ నంబర్లు జారీ చేసే ప్రభుత్వ ఏజెన్సీ UIDAI పేర్కొంది.
"ఏ వ్యక్తి అయినా తమ ఆధార్‌ను 10 సంవత్సరాల క్రితం పొంది ఉండి, ఆ తర్వాతి సంవత్సరాల్లో సమాచారాన్ని అప్‌డేట్ చేయని వారు డాక్యుమెంట్ అప్‌డేషన్ చేయవలసిందిగా అభ్యర్థించబడుతోంది" అని UIDAI ప్రకటనలో పేర్కొంది. కనీస రుసుము చెల్లింపు చేయడం ద్వారా గుర్తింపు పత్రాలు మరియు రెసిడెన్స్ ప్రూఫ్ అప్‌డేట్ చేసుకోవచ్చు అని వెల్లడించింది.

మై ఆధార్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు:
"ఈ సదుపాయాన్ని మై ఆధార్ పోర్టల్‌లో లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు" అని UIDAI పేర్కొంది. కనుపాపలు, వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా ఆధార్ గుర్తింపు ప్రొగ్రామ్ కొనసాగుతుంది.

పదేళ్లుగా ఆధార్ కార్డుతో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు:
ఆధార్ ప్రవేశపెట్టిన గత దశాబ్ద కాలం నుంచి ఆధార్ నంబర్ అనేది దేశంలోని వ్యక్తులకు గుర్తింపునకు సాక్ష్యంగా కొనసాగుతుందని ప్రకటన పేర్కొంది. ఈ ఆధార్ ద్వారా వ్యక్తులను సులభంగా గుర్తించడమే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాలు మరియు సేవలలను ప్రజలు సులువుగా పొందేందుకు ఆధార్ నంబర్ ఉపయోగించబడుతుంది. వ్యక్తులు తమ ఆధార్ డేటాను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు పొందడంలో గానీ, గుర్తింపు/ ధృవీకరణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండవచ్చని యూఐడీఏఐ పేర్కొంది.

అదేవిధంగా, ఒకసారి ఆధార్ కార్డు పోగొట్టుకుపోయినట్లయితే మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత "మై ఆధార్" సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్షన్‌లో కింద కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంతరం మీ ఆధార్ నంబర్ టైప్ చేసిన తర్వాత, రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయాలి.
* లాగిన్ విజయవంతం అయిన తర్వాత మీకు మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కార్డు ఓపెన్ అవుతుంది.
* అక్కడే డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* అయితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. డౌన్‌లోడ్ అయిన ఆధార్ ఫైల్ ను మీరు ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అడుగుతుంది.
* ఆ పాస్‌వర్డ్ ఏంటంటే.. మీ పేరులోని నాలుగు అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం అంకెలు టైప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఉదాహరణకు.. మీ పేరు AVINASH, పుట్టిన సంవత్సరం 1990 అనుకుంటే, పాస్ వర్డ్ వచ్చేసి.. పేరులో మొదటి 4 అక్షరాలు.. పుట్టిన సంవత్సరం అంకెలు కలిపి AVIN1990 అని టైప్ చేయాలి. ఇక మీ ఆధార్ మీకు కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








