ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకున్నారా.. సెప్టెంబర్ 14 వరకు గడువు.. పూర్తి వివరాలు..!
ఆధార్ కార్డును ప్రస్తుతం ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అప్‌డేట్ గడువును ఇప్పటికే అనేక సార్లు పెంచింది. గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు పెంచింది. అనంతరం ఆ గడువును జూన్ 14 వరకు పొడిగించింది. ప్రస్తుత గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంది. ఈ గడువు తేదీలోగా ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో ఆధార్‌ను అప్‌డేట్ చేయకుంటే వెంటనే సంబంధిత వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.
ఆధార్ లో అడ్రస్ వివరాలతోపాటు పేరు, ఫోటోలను కూడా అప్‌డేట్ (Aadhaar Card Update) చేసుకోవచ్చు. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా అడ్రస్ ను అప్‌డేట్ చేయవచ్చు. అదే ఫోటో, పేర్లు మార్చేందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అప్‌డేట్ చేసేందుకు ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌ను అందుబాటులో ఉండాలి.

ఆధార్ కార్డులో అడ్రస్ సహా మరిన్ని వివరాలను ఇంట్లో నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు. ఇందుకు మొబైల్ నంబర్ సహా అడ్రస్ ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి. వాటిని స్కాన్ చేసి ఆధార్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ క్రింది విధంగా ప్రయత్నించండి.
స్టెప్ 1 : తొలుత UIDAI వెబ్‌సెట్‌లోకి వెళ్లాలి. అనంతరం ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌కు నేవిగేట్ కావాలి.
స్టెప్ 2 : వెబ్‌సైట్‌లో లాగిన్ చేసేందుకు ఆధార్ నంబర్, Captcha కోడ్, లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ కావాలి.
స్టెప్ 3 : లాగిన్ తర్వాత డాక్యుమెంట్ అప్‌డేట్ సెక్షన్ కు వెళ్లాలి. అందులోని వివరాలను సరిచూసుకోవాలి.
స్టెప్ 4 : అప్పటికే మీ వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసిన ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5 : ఆధార్‌లో వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత మీకు ఒక సర్వీస్ రిక్వస్ట్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ ఆధారంగా మీ అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డులో పూర్తి వివరాలు అప్‌డేట్ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం అనేక ఆర్థిక లావాదేవీలు సహా అర్హుల ఎంపికలో ఆధార్ కీలకంగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications






