Home
News

UPI Down దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం.. ఇలాంటి సమయంలో డబ్బులు కట్‌ అయితే ఏం చేయాలి?

దేశవ్యాప్తంగా UPI సర్వీసుల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో UPI సర్వీసులు నిలిచి, అనేక మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ కూడా ప్రముఖ UPI యాప్స్‌ ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం పనిచేయడం లేదు. దీంతో అనేక మంది యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వేయి మందికి పైగా UPI సమస్యలపై ఫిర్యాదు చేశారు. 12.43 నిమిషాలకు ఈ సమస్య మరింత ఎక్కువ అయిందని, మరింత మంది ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌ డిటెక్టర్‌ తెలిపింది. డౌన్‌ డిటెక్టర్ ప్రకారం 79 శాతం మంది యూజర్లు చెల్లింపుల సమస్య ఎదుర్కొన్నారు.

UPI Down in india again phonepe paytm google pay not working users reporting on social media

UPI అంతరాయంపై NPCI (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పిన NPCI.. సాంకేతిక సమస్యల కారణంగా ట్రాన్సాక్షన్‌లకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

గత నెల 26 వ తేదీన కూడా UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. సుమారు 2 నుంచి 3 గంటల వరకు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక కారణాలతోనే సేవల్లో ఇబ్బంది తలెత్తినట్లు NPCI గతంలోనే వెల్లడించింది. ఏప్రిల్‌ 2 న కూడా UPI ట్రాన్సాక్షన్‌లు కొంత సమయం నిలిచిపోయాయి. తాజాగా మరోసారి UPI లావాదేవీలు నిలిచిపోయాయి.

గతం కంటే ఇటీవల కొన్ని సంవత్సరాలుగా డిజిటల్‌ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. చిన్న కిరాణా దుకాణాల నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌లోనూ డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. UPI (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ను NPCI అభివృద్ధి చేసింది. RBI (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) పర్యవేక్షణలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

UPI సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన సమయంలో ట్రాన్సాక్షన్‌లు ఫెయిల్‌ అవుతుంటాయి. అంటే మన అకౌంట్‌లో డబ్బులు కట్‌ అయినా.. అవతలి యూజర్లకు అవి చేరవు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో చాలా సార్లు డబ్బులు ఆటోమేటిక్‌ రివర్సల్‌ అవుతుంటాయి.

ఆటోమేటిక్‌ రివర్సల్‌ అంటే UPI ద్వారా డబ్బులు మీ ఖాతా నుంచి కట్‌ అవుతాయి. కానీ ఇతరుల ఖాతాలకు అవి చేరవు. అయితే ఈ నగదు 24 గంటల నుంచి గరిష్టంగా 3 పని దినాల్లో ఆటోమేటిక్‌గా మీ బ్యాంకు అకౌంట్‌లోకి జమ అవుతుంటాయి.

కొన్నిసార్లు ఆటోమేటిక్ రివర్సల్‌కు అవకాశం ఉండదు. ఇలాంటి సమయాల్లో బ్యాంకు కస్టమర్‌ కేర్‌ లేదా UPI కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేందుకు ట్రాన్సాక్షన్‌ ఐడీ సహా మరిన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలతో మీ పేమెంట్ ను ట్రాక్‌ చేస్తారు.

మీ డబ్బులు ఎప్పటి లోగా బ్యాంకు ఖాతాకు జమ అవుతాయో అంచనా వివరాలు చెబుతారు. లేదంటే మీకు సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌కు నేరుగా వెళ్లి, పేమెంట్‌ స్థితిని తెలుసుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌ ఐడీ సహా ఇతర వివరాలు అందించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
UPI Down in india again phonepe paytm google pay not working users reporting on social media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X