Home
News

Upi లైట్‌తో చిన్న మొత్తంలో పేమెంట్స్ చేయడం మరింత సులభం!! ఇంటర్నెట్ లేనప్పుడు కూడా

ప్రపంచం మొత్తం మీద మరీ ముఖ్యంగా ఇండియాలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ బాగా ప్రాచుర్యం పొందింది. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ప్రతి చిన్న విషయానికి కూడా డిజిటల్ పద్దతిలో పేమెంట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా UPI పేమెంట్స్ ఆధారిత అప్లికేషన్‌లకు జనాదరణ విపరీతంగా పెరిగింది. ఆఫ్‌లైన్ మోడ్‌లో తక్కువ మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం ఇప్పుడు సాధ్యమవుతుంది. దీని కోసం UPI లైట్‌ని ప్రవేశపెట్టారు. UPIలోని వినియోగదారుల కోసం UPI లైట్ ఆన్-డివైస్ వాలెట్ ఎంపికగా సెట్ చేయబడింది. ఈ విధంగా మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు అంటే ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు కూడా వేరొకరికి తక్కువ మొత్తంలో డబ్బును పంపవచ్చు.

NPCI

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నపుడు ఇతరులకు డబ్బును పంపడానికి ఇప్పుడు అనుమతిస్తోంది. దీని కోసం UPI లైట్ ప్రారంభం కానుంది. ఇది ఇప్పటికే తనతో లింక్ అయిన అన్ని రకాల సభ్య బ్యాంకులకు తెలియజేసింది. ఇది PayTMతో సహా ఇతర మొబైల్ వాలెట్ల మాదిరిగానే పని చేస్తుంది. ఐతే UPI లైట్ ద్వారా డబ్బును పంపడం ఎలాగో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

UPI అప్లికేషన్‌

UPI అప్లికేషన్‌లను ఉపయోగించే వినియోగదారులు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు తక్కువ మొత్తంలో లావాదేవీలను నిర్వహించవచ్చు. UPI లైట్‌ని ప్రారంభించే అవకాశం తమకు ఉందని NPCI తన సభ్య బ్యాంకులకు సర్క్యులర్‌లో తెలిపింది. UPI లైట్ ప్రారంభించబడిన తర్వాత వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్ నుండి UPI లైట్ వాలెట్‌కు నిధులను బదిలీ చేయగలరు. మీరు ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం ఈ డబ్బును ఉపయోగించవచ్చు.

UPI లైట్ ఆఫ్‌లైన్ మోడ్‌

UPI లైట్ ఆఫ్‌లైన్ మోడ్‌

UPI లైట్ ఇప్పుడు ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే పేమెంట్లను డెబిట్ చేస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో అకౌంట్ జమ చేయవలసి ఉంటుంది. అయితే NPCI యొక్క తరువాతి దశలో UPI లైట్ కంప్లీట్ ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. డెబిట్ మరియు క్రెడిట్ రెండూ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ UPI లైట్ పేమెంట్ లావాదేవీకి గరిష్ట పరిమితి రూ.200 కానీ ఆన్-డివైస్ వాలెట్ కోసం బ్యాలెన్స్ యొక్క మొత్తం పరిమితి రూ.2,000 వరకు ఉంటుంది.

UPI

అదనంగా వినియోగదారులు తమ UPI అప్లికేషన్‌ల నుండి ఎప్పుడైనా UPI లైట్ సేవలను నిలిపివేయగల సామర్థ్యాన్ని అందించారు. ఈ వాలెట్ డియాక్టివేట్ చేయబడినప్పుడు బ్యాలెన్స్ ఫండ్ వినియోగదారుల అకౌంటుకు తిరిగి వచ్చే సదుపాయం కూడా ఉంది. UPI లైట్‌లో మీ లావాదేవీ వివరాలను UPI అప్లికేషన్ యొక్క లావాదేవీ హిస్టరీ పేజీలో కనుగొనవచ్చు. NPCI ప్రకారం UPI అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వినియోగదారులకు చూపబడుతుంది. ప్రస్తుతం UPI లైట్ ఉపయోగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
UPI Lite Arriving Very Soon in India: Making Small Value Transactions is Even Easier When There is no Internet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X