Home
News

UPI యాప్స్‌లో తరచూ బ్యాలెన్స్‌ తనిఖీ చేస్తుంటారా.. అయితే ఆగస్టు 1 నుంచి కీలక మార్పులు..!

భారత్‌లో UPI (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావీదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం జూన్‌ నెలకు సంబంధించిన వివరాలు ఇటీవల విడుదల అయ్యాయి. ప్రతి నెలా 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం జూన్‌ నెలలో రూ.24.03 లక్షల కోట్ల విలువైన UPI లావాదేవీలు జరిగాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌, సింగపూర్, నేపాల్‌, శ్రీలంక, UAE, ఫ్రాన్స్‌, మారిషన్‌ వంటి దేశాల్లో UPI సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ :
అయితే ఆగస్టు 1 నుంచి UPI కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ సామాన్యులతోపాటు వ్యాపారులను కూడా ప్రభావితం చేస్తాయి. పేటీఎం, ఫోన్‌పే, జీపే సహా ఇతర యూపీఐ ప్లాట్‌ఫాంలు ఉపయోగిస్తున్న వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి.

UPI New Rules from august 1 2025

ఈ సమస్యలకు పరిష్కారం :
యూపీఐ లావాదేవీల్లో అవాంతరాలకు చోటు లేకుండా NPCI (నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా) కొత్త రూల్స్‌ ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా లావాదేవీలు విఫలం కావడం లేదా లావాదేవీలు పూర్తి అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వంటి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో UPI లావాదేవీలు ప్రభావితం చెందకుండా మరియు మరింత సౌకర్యవంతంగా UPI ను ఉపయోగించుకొనేందుకు ఈ కొత్త నిబంధనలు వీలు కల్పిస్తాయని NPCI భావిస్తోంది. అయితే ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త రూల్స్‌ ఏంటి..?

బ్యాలెన్స్‌ తనిఖీ :
కొంత మంది బ్యాంకులకు చెందిన యాప్స్‌ ద్వారా తమ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ ను తనిఖీ చేస్తుంటారు. అదే మరికొంత మంది యూపీఐ యాప్స్‌ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను తనిఖీ చేస్తుంటారు. ప్రస్తుతం రోజులో ఎన్ని సార్లు అయినా యూపీఐ యాప్స్‌ ద్వారా బ్యాలెన్స్‌ తనిఖీ చేసేందుకు అవకాశం ఉంది.

ఆగస్టు 1 నుంచి కేవలం రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్‌ తనిఖీ చేసుకొనేందుకు వీలుంటుంది. బ్యాలెన్స్‌ తనిఖీ పై పరిమితి విధించడం ద్వారా రద్దీని నియంత్రించవచ్చని NPCI భావిస్తోంది. రద్దీ సమయాల్లో లావాదేవీలపై విఫలం కావడం లేదా ఎక్కువ సమయం తీసుకోవడం వంటివి జరగకుండా నియంత్రించవచ్చని భావిస్తోంది.

Take a Poll

ఆటోమేటిక్ పేమెంట్స్‌లో మార్పులు :
దీంతోపాటు UPI ఆటోపే ఫీచర్లలోనూ కొన్ని మార్పులు రానున్నాయి. ఆగస్టు 1 నుంచి ఆటోమేటిక్‌ పేమెంట్స్ కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తుంది. ఇప్పటి వరకు సబ్‌స్క్రిప్షన్‌ లు, బిల్లులు, EMI వంటి రోజులో కచ్చితమైన సమయంలోనే ప్రాసెస్‌ చేయబడతాయి.

ఇలా చేయడం ద్వారా సాధారణ సమయాల్లో యూపీఐ సేవల్లో వేగం పెరుగుతుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (NPCI) భావిస్తోంది. ఈ కొత్త UPI నిబంధనలు ఆగస్టు 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్‌ చెల్లింపుల్లో 85 శాతం UPI ద్వారానే జరుగుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
UPI New Rules from august 1 2025 all users need to know these changes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X