షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఆ మొబైల్ నంబర్లకు యూపీఐ బంద్..
UPI Payments Block: యూపీఐ యూజర్లకు బాడ్ న్యూస్. గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm) లాంటి యాప్స్ ద్వారా మీరు UPI చెల్లింపులు జరుపుతుంటే, మీకు ఇది చాలా ముఖ్యమైన వార్త. 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని మొబైల్ నంబర్లకు UPI సేవలు ఆగిపోనున్నాయి. చాలాకాలంగా వాడని మొబైల్ నంబర్లను బ్యాంక్ అకౌంట్ల నుంచి తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశించింది.
* ఎందుకీ నిర్ణయం, సైబర్ మోసాలే కారణమా?
నిజానికి సైబర్ మోసాలు పెరిగిపోవడంతోనే NPCI ఈ నిర్ణయం తీసుకుంది. చాలామంది పాత మొబైల్ నంబర్లు వాడకుండా వదిలేస్తుంటారు. టెలికాం కంపెనీలు ఆ నంబర్లను వేరే వాళ్లకు అమ్మేస్తుంటాయి. మీ పాత నంబర్ ఇంకా మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండి, ఆ నంబర్ వేరే వాళ్ల చేతిలోకి వెళ్తే రిస్క్ ఎక్కువ.

* మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..
మీ UPI లింక్ ఉన్న మొబైల్ నంబర్ కనుక వాడకుండా ఉంటే, మీరు డబ్బులు పంపలేరు, డబ్బులు తీసుకోలేరు. OTPలు కూడా రావు. UPI యాప్స్ పనిచేయడం ఆగిపోతాయి. అంతేకాదు, బ్యాంక్ నుంచి వచ్చే ముఖ్యమైన మెసేజ్‌లు కూడా మీకు రావు. మీ అకౌంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు.
* ఇప్పుడేం చేయాలి..
ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఇటీవలే కొత్త నంబర్ తీసుకుంటే, వెంటనే మీ బ్యాంక్‌లో, UPI యాప్స్‌లో మార్చేయాలి. మీ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
అందుకు మీ టెలికాం ప్రొవైడర్‌కు (జియో, ఎయిర్‌టెల్, Vi, లేదా బీఎస్‌ఎన్ఎల్) కాల్ చేయాలి. ఒకవేళ మీ నంబర్ యాక్టివ్‌గా లేకపోతే, వెంటనే రీఛార్జ్ చేసి యాక్టివ్ చేసుకోండి. లేదా మీ కొత్త నంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ పని చేయకపోయినా చివరికి నష్టపోయేది మీరే అవుతారు.
* ఎప్పటి నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది..
కొత్త రూల్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బ్యాంకులు, UPI యాప్స్ అన్నీ మార్చి 31, 2025 లోపు వాడని నంబర్లను తీసేయాలి. ఇంకా టైమ్ ఉందిలే అని అనుకోకుండా, వెంటనే మీ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. లేదంటే మీ UPI సేవలు ఆగిపోతాయి.


Click it and Unblock the Notifications








