Home
News

బయోమెట్రిక్, ఫేస్‌ ఐడీ ద్వారా యూపీఐ పేమెంట్‌లు.. ఈ ప్రతిపాదన ఎందుకో తెలుసా..?

భారత్‌ లో ప్రస్తుతం లక్షల మంది UPI ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనేక UPI యాప్‌ లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశంలో డిజిటల్‌ పేమెంట్ల వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా కీలక అప్‌ గ్రేడ్‌ లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఈ అంశంపై సంబంధిత సంస్థలతో చర్చించినట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్‌ ఫీచర్‌ లను ఉపయోగించి పేమెంట్లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే త్వరలో UPI పేమెంట్స్‌ ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ లలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐఫోన్‌ లలో ఫేస్‌ ఐడీ ద్వారా చేసే వీలుందని తెలుస్తోంది. ఈ వివరాలు మనీకంట్రోల్‌ కథనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దేశంలో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో UPI పేమెంట్‌ లను భద్రంగా నిర్వహించుకొనేందుకు వీలుగా ఈ తరహా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

UPI payments could soon through face id or biometric

ప్రస్తుతం దేశంలోని వివిధ డిజిటల్ పేమెంట్‌ యాప్‌ ల ద్వారా 4 లేదా 6 అంకెల పిన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న UPI వ్యవస్థ అత్యంత సురక్షితమైనదిగా ఉంది. అయితే నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసి భారీగా నగదును తమ బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయించుకుంటున్నారు.

దీంతో UPI వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు వీలుగా ఫేస్‌ ఐడీ, బయోమెట్రిక్‌ ద్వారా UPI పేమెంట్లు నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. ప్రస్తుతం దేశంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్‌ పే సహా అనేక పేమెంట్‌ యాప్‌ లు అందుబాటులో ఉన్నాయి.

దేశంలో ఇటీవల కాలంలో ఫేక్ UPI స్కాం, OLX స్కాం వంటివి వెలుగులోకి వచ్చాయి. దీంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వినూత్నంగా ఆలోచన చేస్తోంది. బయోమెట్రిక్‌, ఫేస్‌ ఐడీ ద్వారా మరింత సురక్షితంగా డిజిటల్ పేమెంట్‌లు చేయవచ్చని భావిస్తోంది. అయితే ఈ వ్యవస్థ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

డిజిటల్‌ లావాదేవీల్లో అదనపు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలనే రిజర్వ్‌ బ్యాంక్‌ సూచనతో నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ తరహా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పిన్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థతో సహా బయోమెట్రిక్‌ వ్యవస్థ కూడా కొత్త కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
UPI payments could soon through face id or biometric authentication in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X