పికాసా వెబ్ ఆల్బమ్‌లోకి ఫోటోలను ఏలా అప్‌లోడ్ చేయాలి..?

Posted By: Staff

పికాసా అనేది గూగుల్ సంస్థ ఆధీనంలో ఉన్న ఫోటో‌లు నిల్వచేసుకునే, నిర్వహించుకునే ఒక సాఫ్ట్‌వేర్. దీనిని ఉపయోగించి ఫోటోలు సులువుగా నిల్వ చేయవచ్చు. దీనిని 2002 లో ఐడియాల్యాబ్ తయారు చేస్తే 2004‌లో గూగుల్ ఆధీనంలోకి తీసుకుంది.

గూగుల్‌ చాలామందికి సెర్చింజిన్‌గానే పరిచయం. కానీ, అదొక సాఫ్ట్‌వేర్ల భాండాగారం కూడా. అనేకానేక అవసరాలను తీర్చే సౌకర్యాలు దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో పికాసా ఒకటి. వివిధ సైట్ల  నుంచి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకోవటం దగ్గరి నుంచి వాటిని మీ అభిరుచుల మేరకు ఎడిట్‌ చేయటం, అన్నింటినీ కట్టగట్టి ఫ్రెండ్స్‌కు పంపించటం, పీసీలో ఓ పద్ధతి ప్రకారం ఆర్గనైజ్‌ చేయటం... ఇవన్నీ పికాసాతో సాధ్యం. పికాసాలో ఎక్కువగా ఉపయోగపడేది 'అప్‌లోడ్‌ ఆల్బమ్స్‌' ఫీచర్.

దీని ద్వారా మీ సిస్టమ్‌లోని ఫొటోలను మీ ఈమెయిల్‌లో పబ్లిక్‌, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపంలో భద్రపరుచుకోవచ్చు. అయితే దీనికోసం జీమెయిల్‌ ఎకౌంట్‌ ఉండటం తప్పనిసరి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవటానికి, స్క్రీన్‌ పై కుడి వైపునున్న Sign in to Web Albumsని క్లిక్‌ చేసి జీ-మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా సైన్‌ఇన్‌ కావాలి. తర్వాత పీసీలో ఫొటోలను సెలెక్ట్‌ చేసి Web Albumని క్లిక్‌ చేసి ఆల్బమ్‌ పేరుతో పాటు ఇతర వివరాలను టైప్‌ చేయ్యాలి. అలాగే, ఎంత రిజల్యూషన్‌లో ఫొటోలు డిస్‌ప్లే కావాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు. అది ఏలాగో ఈ ఫోటో ఫీచర్ ద్వారా తెలుకుందాం.
 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

step-1

step-1

step-2

step-2

step-3

step-3

step-4

step-4

step-5

step-5

step-6

step-6

step-7

step-7

step-8

step-8

step-9

step-9
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot