US Tariffs War అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్.. ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయా?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక.. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అనేక దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయనే కారణంగా, ట్రంప్ ప్రతీకార సుంకాలను (US Tariffs War) విధించడం ప్రారంభించారు. ఈ జాబితాలో భారత్ చైనా సహా అనేక దేశాలున్నాయి.
భారత్ పై 26 శాతం టారిఫ్ విధించారు. అదే సమయంలో చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 54 శాతం విధించారు. ఏప్రిల్ 5 నాటికి భారత్ సహా ఇతర దేశాలపై 10 శాతం టారిఫ్ అమల్లోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 9 నుంచి పూర్తి స్థాయిలో టారిఫ్‌లు అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే పూర్తిస్థాయి టారిఫ్ అమలను తాత్కాలికంగా నిలిపివేశారు.

చైనా మినహా అన్ని దేశాలపై 90 రోజుల వరకు టారిఫ్‌ల అమలును నిలిపేశారు. అయితే అమెరికా సుంకాలపై చైనా దీటుగా బదులిచ్చింది. అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపింది. అయితే చైనాపై ఉన్న 145 శాతం సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతానికి పెంచి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయితే దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో రెండు అగ్రదేశాల మధ్య ట్రేడ్ వార్ పోటీ పతాక స్థాయికి చేరింది. ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో తెలియక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాంధ్యానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో ఇరు దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కారణంగా ప్రపంచ గ్యాడ్జెట్‌లో మార్కెట్‌లో ధరల పెరుగుదల సహా, సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొనే అవకాశం ఉంది. దీని కారణంగా దీర్ఘకాలంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు.
అయితే ప్రస్తుతం అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు చాలా వరకు చైనా నుంచే బ్యాటరీలు, చిప్‌సెట్, డిస్‌ప్లేలు వంటి విడిభాగాల కోసం చైనా పైనే ఆధారపడుతున్నాయి. ఈ భారీ టారిఫ్‌ల కారణంగా ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషించడం లేదా కొనుగోలు దారులపై భారాన్ని మోపడం వంటివి ప్రయత్నించే అవకాశం ఉంది. కొన్నిసార్లు రెండింటినీ కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫలితంగా భారీగా ధరలు పైకి ఎగబాకే అవకాశం ఉంది. బడ్జెట్, మిడ్ రేంజ్ పరికరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం పరిస్థితుల నుంచి గట్టేక్కేందుకు తయారీ సంస్థలు చైనా నుంచి తమ ప్లాంట్‌లను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆపిల్ సంస్థ గతం కంటే అధిక స్థాయిలో భారత్‌లో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తోంది. దీంతోపాటు Dell, HP వంటి సంస్థలు వియత్నాం, మెక్సికోలకు తమ ల్యాప్‌టాప్ తయారీ ప్లాంట్స్‌ను తరలిస్తున్నాయి.
అయితే టారిఫ్‌ల కారణంగా చైనా నుంచి బయటకు వచ్చే సంస్థలు, ఇతర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను నిర్మించడం సహా కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వడం తోపాటు నిపుణులను నియమించుకోవాలి. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల కారణంగా తక్కువ సంఖ్యలో మాత్రమే గ్యాడ్జెట్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు కొన్ని గ్యాడ్జెట్‌లు లాంచ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అమెరికా మోడల్స్ తొలుత యూరప్ లేదా ఆసియాలో లభించే అవకాశం ఉంది.
చైనా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే, బ్యాటరీల తయారీలో ఉపయోగించే కీలకమైన గాలియం, జెర్మేనియం, యాంటిమోనీ వంటి ఖనిజాల ఎగుమతులను సరఫరాను అడ్డుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ చిప్, 5G రేడియోలలో గాలియంను ఉపయోగిస్తారు.
అదే ఫైబర్ ఆప్టిక్స్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లులో జెర్మేనియంను ఉపయోగిస్తారు. వీటి సరఫరాను చైనా అడ్డుకోవడంతో అమెరికా సహా ఇతర దేశాల సంస్థలు ప్రత్యా్మ్నాయాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో AR హెచ్‌సెట్, గేమింగ్, 5G పరికరాలు సహా ఇతర గ్యాడ్జెట్‌ల ఉత్పత్తి, విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications