అమెరికా వీసా కావాలంటే ఆ వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే

వీసాల జారీ విషయంలో అమెరికార మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీస

|

వీసాల జారీ విషయంలో అమెరికార మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసేవారు ఇక నుంచి సోషల్‌ మీడియా వివరాలు కూడా సమర్పించాలని కొత్త నియమాన్ని తీసుకొచ్చింది.

అమెరికా వీసా కావాలంటే ఆ వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే

ఇకపై అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో దాదాపు అందరూ, తాము వాడుతున్న అన్ని సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలూ చెప్పాల్సిందేనంటూ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రభావం ఏటా ఒకటిన్నర కోటి మందిపై ఉండనుంది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనీ, దేశ భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అధికారులు అంటున్నారు.ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

  ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా

ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలను క్షుణ్నంగా పరిశీలించి, ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరోధించడంలో భాగంగానే ఇకపై సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను కూడా దరఖాస్తుదారులు వెల్లడించాల్సిందేననే నిబంధనను తెచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

 ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే

ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే

తాత్కాలిక పర్యటన కోసం వచ్చే వారు సహా ఎవ్వరైనా ఈ వివరాలు తెలియజేయాల్సిందేననీ, ఒకవేళ ఎవరికైనా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలే లేకపోతే వాళ్లు ఆ విషయమే చెప్పవచ్చని తెలిపారు. అయితే ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే వలస నిబంధనలకు అనుగుణంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అధికారి హెచ్చరించారు.

తమ దేశానికి వచ్చే విదేశీయుల వివరాలను పూర్తిగా పరిశీలించడంలో ఇదో కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 2017 మార్చిలోనే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవ్వగా, దీనిని అమలును అమెరికా విదేశాంగ శాఖ 2018 మార్చిలో ప్రారంభించింది.

 సోషల్‌ మీడియా అకౌంట్లను
 

సోషల్‌ మీడియా అకౌంట్లను

వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏ పేర్లతో సోషల్‌ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఐదేండ్లకు సంబంధించి ఈ మెయిల్‌ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. ఒక వేళ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పుడు సమాచారం ఇస్తే వారి అప్లికేషన్‌ను తిర్కసరించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు.

 ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం

ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం

గతంలో వీసాకు అప్లై చేసేవారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ జరిపేవారు అయితే తాజా నిబంధనల మేరకు వారి సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలించి నిర్థారించుకోనున్నారు. వాస్తవానికి సోషల్‌ మీడియా అకౌంట్ల ప్రతిపాదన గతేడాదే తెరపైకి వచ్చింది ,ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే దాని అమల్లో తీసుకొచ్చింది ఈ కొత్త నిబంధనతో ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ద్వైపాక్షిక, అధికారిక వీసాల విషయంలో మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు.

2017లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, దరఖాస్తుదారులపై.. భద్రత విషయంలో నియంత్రణ కోసం, గత ఏడాది మొదటిసారిగా ఈ ప్రకటన వెలువడింది.ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం, విహారయాత్రలకు వెళ్లేవారందరూ కొత్త నిబంధనలకు లోబడి, తగిన సమాచారాన్ని ఇవ్వాలి.

సరదాగా చేసిన పోస్ట్ వల్ల

సరదాగా చేసిన పోస్ట్ వల్ల

ఈవిధమైన తనిఖీ నిష్పాక్షికంగా జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. కానీ, ఇంటర్నెట్‌లో సరదాగా చేసిన పోస్ట్ వల్ల తమకు ప్రమాదం వస్తుందేమోనని దరఖాస్తుదారులు ఆలోచనలో పడతారు' అని ది యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

Best Mobiles in India

English summary
US now wants social media details of last 5 years from visa applicants

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X