అమెరికా రెండో మాంద్యమా.. ఎవరా మాటన్నది: ఒబామా

Posted By: Staff

అమెరికా రెండో మాంద్యమా.. ఎవరా మాటన్నది: ఒబామా

వాషింగ్టన్‌: అమెరికా మరో మాంద్యాన్ని ఎదుర్కోవడం లేదని అధ్యక్షుడు ఒబామా చెప్పారు. అయితే దేశం నిరుద్యోగ సంక్షోభాన్ని వేగంగా పరిష్కరించగలిగేటంత రికవరీని సాధించని ప్రమాదం పాలబడిందని ఆయన అన్నారు. గత వారంలో అయోవా, ఇలినాయిస్‌, మిన్నెసొటా రాష్ట్రాలకు ఒబామా బస్సులో ప్రయాణించిన సందర్భంగా ఆయనను సీబీఎస్‌ న్యూస్‌ ఇంటర్వ్యూ చేసింది. ఈ రికార్డెడ్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''నిరుద్యోగం రేటు ఇప్పటికీ మరీ ఎక్కువగా ఉంది.. మన ఆర్థిక వ్యవస్థ ఏమంత వేగంగా పురోగమించడం లేద''న్నారు. 'మరో మాంద్యం గుప్పిట్లో మనం చిక్కుకొన్నామని నేను అనుకోవడం లేదు.

యూరోప్‌ రుణ సంక్షోభం, జపాన్‌ సునామీ, గ్యాస్‌ అధిక ధరలు వంటి బయటి అంశాలు మన ఆర్థిక వృద్ధిని దెబ్బతీశాయి అని ఆయన వివరించారు. వృద్ధి చెందవలసినంత వేగం కన్నా తక్కువగా ఆర్థిక వ్యవస్థ రెండు శాతం మేరకు మత్రమే వృద్ధి చెందినందుకు మార్కెట్లు అలా ప్రతిస్పందించాయని భావిస్తున్నాను అని ఒబామా చెప్పారు. గత రెండున్నరేళ్లుగా తాను మరింత ఉపాధిని సృష్టించడానికి, మందగమనంతో ప్రభావితం అయిన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడపడానికి ప్రాధాన్యం ఇచ్చానన్నారు. ఇందులో మనం కొంత పురోగతిని సాధించాం.. గత 17 మాసాలలో రెండు మిలియన్‌ ఉద్యోగాలు పుట్టుకువచ్చాయి.

కానీ గత ఆరు నెలలుగా ఆర్థిక వ్యవస్థలో పలు వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ సమస్యలను మనం పరిష్కరించుకోగలం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనం చేసుకోవలసిన సర్దుబాట్లు బాగా తక్కువే. గ్రీస్‌కు ఉన్న మాదిరి సమస్యలు మనకు ఉంటే ఆర్థిక వ్యవస్థను సమూలంగా పునర్‌నిర్మించుకోవలసివచ్చేది.. అటువంటి సమీకరణం ఇక్కడ లేదు అని ఒబామా వివరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting