‘నో’ చెప్పిన అమెరికా..?

Posted By: Super

 ‘నో’ చెప్పిన అమెరికా..?

 

‘అంతర్జాల వ్యవస్థన అగ్రరాజ్యం అమెరికా శాసిస్తుందన్న చైనా, రష్యాలు ఆందోళణ వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలోకి ఇంటర్నెట్ ను తీసుకురావలన్న ప్రతిపాదనను ఒబామా యంత్రాంగం పూర్తిగా వ్యతిరికేస్తోంది.’

ఇంటర్నెట్‌ను ఐక్యరాజ్యసమితి పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనను ఒబామా నేతృత్వంలోని ఆ దేశ యంత్రాంగం వ్యతిరేకించినట్లు ఉన్నతాధికారి ఒకరు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ విచారణలో భాగంగా అమెరికా తమ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. టెలికం వ్యవస్థను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ పరిధిలోకి ఇంటర్నెట్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదనకు అమెరికా వ్యతిరేకిస్తూ వస్తుంది.

ద్వైపాక్షిక, బహుళ పాక్షిక చర్చల్లోనూ ఇంటర్నెట్‌పై వివిధ దేశీయ ప్రభుత్వాల నియంత్రణ ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకిస్తున్నట్టు ఐటీ విధాన సమన్వయకర్త ఫిలిప్ వీర్‌వీర్ వివరించారు. దీనివల్ల దుష్ఫలితాలు సంభవిస్తాయని హెచ్చరించారు. డిసెంబర్‌లో జరిగే అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్స్ యూనియన్(ఐటీయూ)లో కొన్ని దేశాలు ఇంటర్నెట్‌పై పర్యవేక్షణకు పట్టు పట్టనున్న నేపథ్యంలో ఈమేరకు ఫిలిప్ వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్‌ను అమెరికా శాసిస్తోందని రష్యా, చైనాలతోపాటు కొన్ని దేశాలు వాదిస్తున్నాయి. సమితి పర్యవేక్షణలోకి ఇంటర్నెట్ చేరిన పక్షంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశాలు లభిస్తాయని ఆయా దేశాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot