గూగుల్ షేర్ మార్కెట్ పడిపోవడానికి కారణం

Posted By: Staff

గూగుల్ షేర్ మార్కెట్ పడిపోవడానికి కారణం

శాన్ ప్రాన్సికో: ఇప్పుడే అందిన సమాచారం మేరకు అమెరికా సెర్చ్ మార్కెట్లో గ్లోబల్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ షేర్లు యాహుతో పోల్చితే బాగా తగ్గాయని సమాచారం. ఈ విషయాన్ని విడుదల చేసింది ఆన్ లైన్ రీసెర్చ్ సంస్ద కామ్ స్కోర్. కామ్ స్కోర్ అందిన డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్ సెర్చ్ మార్కెట్లో జూన్ నెలలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ మార్కెట్ షేర్ 65.5 శాతం ఉండగా అదే మార్కెట్ షేర్ జులై నాటికి 65.1శాతానికి తగ్గిందని వెల్లడించారు.

అదే యాహు విషయంలో మాత్రం రివర్స్ అయిందని తెలిపారు. పోయిన జూన్ నెలలో యాహు సెర్చ్ మార్కెట్ 15.9 శాతం ఉండగా అదే జులై నెలలో అనూహ్యంగా 16.1శాతానికి పెరిగిందని తెలియజేశారు. ఈ రెండింటి సెర్చ్ మార్కెట్ ఇలా ఉంటే మైక్రో సాప్ట్ సెర్చ్ ఇంజన్ అయినటువంటి బింగ్ మార్కెట్ షేర్ మాత్రం నిలకడగా ఉన్నట్లు తెలియజేశారు. జూన్ నెలలో 14.4 శాతం ఉండగా, జులై నెలలో కూడా 14.4 శాతంలో ఉండి ఒకే విధమైన మార్కెట్ షేర్‌ని మెయింటైన్ చేసిందని తెలిపారు. ఐతే ఒక్కసారిగా గూగుల్ సెర్చ్ షేర్ పడిపోవడానికి కారణం అమెరికా సంక్షోభమేనా అని గూగుల్ ప్రతినిధిలు తెలుసుకొవడంలో తలమనకలవుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot