నాలుగు విధాలుగా వాడుకునే అవకాశం ఉన్న యుఎస్‌బి జెట్ పెన్

Posted By: Super

నాలుగు విధాలుగా వాడుకునే అవకాశం ఉన్న యుఎస్‌బి జెట్ పెన్

పెన్నులా కనిపిస్తూనే ఎన్నో సౌకర్యాలను అందించే పరికరం USB JetPen-MP3 Player. దీన్ని యూఎస్‌బీ డ్రైవ్‌, ఎంపీ3ప్లేయర్‌, ఎఫ్‌ రేడియో, వాయిస్‌ రికార్డ్‌లా వాడుకోవచ్చు. యూఎస్‌బీ 2.0 ప్లాష్‌ డ్రైవ్‌ టెక్నాలజీతో 512 ఎంబీ, 1 జీబీ మెమొరీ సామర్థ్యంతో పై భాగాన్ని పెన్‌డ్రైవ్‌లా రూపొదించారు. డిజిటల్‌ ట్యూనర్‌ ఎంఎఫ్‌ని కూడా నిక్షిప్తం చేశారు. బిల్డ్‌ఇన్‌ మైక్రోఫోన్‌ ద్వారా రికార్డ్‌ చేసుకోవచ్చు. మెమొరీ కార్డ్‌లో పాటల్ని లోడ్‌ చేసుకుని ఎంపీ3 ప్లేయర్‌తో వినొచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 7 గంటలు పని చేస్తుంది. పెన్ను క్యాప్‌లో వాల్యుమ్‌ కంట్రోల్‌, ఎఫ్‌ఎం బటన్స్‌ని ఏర్పాటు చేశారు.


అంతేకాకుండా యుఎస్‌బి జెట్ పెన్ విండోస్ విస్తా/ఎక్స్‌పి/2000, మ్యాక్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కూడా సోపర్ట్ చేస్తుంది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే 1GB – US$ 62 512MB – US$ 45.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot