ఫేస్‌బుక్ పేజిలో రైల్వేల సమాచారం..!

Posted By: Prashanth

ఫేస్‌బుక్ పేజిలో రైల్వేల సమాచారం..!

 

ప్రపంచంలో అతి పెద్ద భాగస్వామ్య సంస్దగా వెలుగొందుతున్న 'భారతీయ రైల్వే' సంస్ద ఆన్‌లైన్ ద్వారా తన సేవలను భారతీయులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు మరో కొత్త అధ్యయానానికి శ్రీకారం చుట్టింది. ఇండియన్ రైల్వేస్‌లో ఉన్న ఢిల్లీ డివిజన్ కొత్తగా ప్రయాణికుల కోసం ఫేస్ బుక్ పేజిని విడుదల చేసింది. ఈ ఫేస్‌బుక్ పేజి ద్వారా ప్రయాణికులు తమయొక్క బెర్తులు, టైమింగ్స్‌ని తెలుసుకోవచ్చు. ఇండియన్ రైల్వైస్ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం ప్రయాణికులు ఖాలీగా ఉన్న బెర్తులతో పాటు ట్రైన్స్ వచ్చి పోయే సమయాలను తెలుసుకోవచ్చు.

ఈ ఫేస్‌బుక్ పేజి నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సర్వీస్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పడు అప్‌డేట్ సమాచారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ పేజి న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ మరియు నిజాముద్దీన్ స్టేషన్ల సమాచారంతో పాటు బెర్త్ల్ గదులు మరియు రైళ్ల సమయాల స్థితి అందించడం నుండి, నిష్క్రమణ వరకు పూర్తి సమాచారం అందిస్తుంది. ఎవరైత్ ప్రయాణికులు తక్కువ దూరంలో ప్రయాణిస్తారో అటువంటి వారు రైల్వేస్ ఉద్భవించే స్టేషన్ల వద్ద రిజర్వేషన్లు వినియోగించుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ - టికెట్ విధానం ద్వారా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు నిబంధనల్ని దక్షణి మద్య రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ - టికెట్ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు వారికి వచ్చిన ఎస్ఎమ్ఎస్ ను పూర్తి సమాచారంతో చూపించని యోడల రూ 50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ - టికెట్ విధానం ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా వారితో పాటు గుర్తింపు కార్డు, ఫాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో గుర్తింపు కార్డు, ఫాస్ పోర్ట్ లాంటి వాటిని చూపించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot