గూగుల్ ఫెయిల్ అయితే?

By: Madhavi Lagishetty

గూగుల్...ఇంటర్నెట్ యూజర్లకు అత్యంత ఉపయోగపడే బెస్ట్ సెర్చ్ఇంజన్. ఏ విషయం అయినా సరే ఠక్కున తెలుసుకోగలిగే నెట్ వర్క్. అన్నింటికీ మించి ఉచిత సేవలు అందించడంలో ముందుంటుంది. ఇక సమాచారాన్ని సెర్చ్ చేసే విషయానికొస్తే... ఆటోమెటిగ్గా గూగుల్లోకి వెళ్లేందుకు ప్రోగ్రామ్ చేయబడి ఉంది. మోస్ట్ ఫేమస్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా లేదా మీకు అవసరమైనప్పుడు మీకు కావాల్సిన సమాచారాన్ని పొందగలరు.

గూగుల్ ఫెయిల్ అయితే?

కొన్ని సందర్భాల్లో గూగుల్లో మీకు అవసరమైన కొంత సమాచారాన్ని పొందలేకపోవచ్చు. ఎగ్జామ్ సమయాల్లో మీరు ఇతర సెర్చ్ ఇంజన్లను సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గూగుల్ నుంచి సమాచారాన్ని పొందలేని సమాయాల్లో మీరు ఇతర సెర్చ్ ఇంజన్ల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అలాంటి సెర్చ్ ఇంజిన్లు మీకోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

DuckDuckGo...

ఈ సెర్చ్ ఇంజిన్ యొక్క ప్రధాన ఫీచర్లో ఒకటి...వినియోగదారుల డేటాను ట్రాక్ చేయకపోవడం. అంతేకాదు యాడ్ ఫ్రీ రహితమైంది. ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది మీరు ఊహించనదానికంటే ఎక్కువగానే ఉంటుంది.

Bing....

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో బింగ్ అనేది సెకండ్ పాపులర్ సెర్చ్ ఇంజిన్. దీని మార్కెట్ వాటా 15శాతం ఉంటుంది. వీడియో సెర్చ్ బెట్టర్ గా ఉంటుంది. ఆటోకంప్లీట్ సజిషన్ రెండు రెట్లు ఎక్కువగా ఇస్తుంది.

Dogpile....

ఇతర సెర్చ్ ఇంజిన్ల నుంచి సమాచారాన్ని, లింక్లను మరింతగా తెలుసుకోవడంలో ఇది పురాతన వెబ్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పవచ్చు. ఇది గూగుల్, యాహూ, యాన్డెక్స్ తోపాటు ఇతరవాటితో సహా అన్ని లింక్స్ ను పొందుతుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మరియు మొజిల్లా , ఫైర్ ఫాక్స్ కూడా స్వంత టూల్ బార్ ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ టైం లైన్ అంటే ఏమిటి?

Yandex...

ఈ రష్యన్ సర్వీస్ గూగుల్ కు సమానమైనదని చెప్పవచ్చు. ఇది రష్యాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 1997లో యాన్డెక్స్ ఒక సెర్చ్ ఇంజిన్ లాగా స్టార్ట్ అయ్యింది. ఇది లాజికల్ ఫార్మట్టో రిజల్ట్ ను అందిస్తుంది. ఇమేజ్లు, వీడియోలు, మెయిల్స్, మ్యాప్స్ తోపాటు మరిన్ని సేవలను అందిస్తుంది.

Ask.com...

సెర్చ్ ఇంజిన్ కంటే....ఇది క్వచ్చన్-ఆన్సర్ సర్వీస్. సెర్చ్ బార్లో అడిగినప్పుడు పరిష్కారం అందిస్తుంది. ఇక్కడ, ఆర్డ్ మరియు లిటరేచర్, జియోగ్రఫీ, ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ నుంచి టెక్నాలజీ, సైన్స్ మరియు బిజినెస్ క్విటీస్ వరకు ఉన్న అంశాలను మీరు ఇక్కడు చూసే అవకాశం ఉంటుంది.

Gibiru....

ఈ సర్వీస్ గూగుల్ నుంచి సెన్సార్ చేయబడిన కంటెంట్ను లాగుతూ షోకాస్ చేస్తుంది. ఇక్కడ ప్రైవసీ సమస్య అనేది దాని అనామక ప్రాక్సీ సెర్చ్ ఇంజిన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది మొజిల్లా ఫైర్పాక్స్ ఎక్స్ టెన్షన్ను కలిగి ఉంటుంది. అన్ సెన్సార్డ్ కంటెంట్ కోసం అవాంచిత సెర్చ్ కు ఉచితంగా ఉంటుంది.

Wolfram alpha....

గణనీయమైన వాస్తవాలను మరియు విశ్వసనీయమైన కళాశాల ప్రచురణలు, గ్రంధాలయాలు, క్రంచ్ బేస్ , FAA, బెస్ట్ బై నుంచి ఈ సర్వీస్ను గణన వాస్తవాలతో డేటాతో వస్తుంది.

క్రియేటివ్ కామన్స్ సెర్చ్....

మీరు మీ వెబ్ సైట్స్ కోసం కాపిరైట్ ఉచిత చిత్రాలను కనుగొనేటప్పుడు ఈ సర్వీస్ చాలా సులభమైంది. మీరు కావాలసిందల్లా ఇమేజ్ పేరు టైప్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
When it comes to searching information, we are automatically programmed to go to Google. However, there are other search engines worth checking out as well. Below is the list of Search engines, we have listed out that you should try if you are bored with Google.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot