Just In
- 2 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Finance
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
- News
ఎలుకతోలు తెచ్చి 400రోజులు ఉతికినా.. నాయకులు కాలేరు: లోకేష్, పవన్‌లపై మంత్రి అంబటి రాంబాబు
- Movies
ఫిల్మ్ ఛాంబర్ లో నటి జమున పార్థివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మీ యొక్క ఆన్‌లైన్ డేటాను సురక్షితంగా ఉంచడానికి తీసుకోవాలని జాగ్రత్తలు...
టెక్నాలజీ అనేది ముందు తరంతో పోలిస్తే కనుక నేడు భారీ మార్పులతో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని వినియోగించడం అలవాటుపడ్డ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ముఖ్యమైన సమాచారంను అంతా కూడా వారి యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లలో తమ యొక్క డేటాను సేవ్ చేసి ఉంచడంతో యూజర్లు తమకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ అనేది ఎల్లప్పుడూ కూడా తమ చేతిలోనే పెట్టుకొని ఉంటారు.

కావున ఇవన్నీ కూడా వినియోగదారుల యొక్క జీవితాలను సులభతరం చేస్తాయి. అయితే ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగిన కూడా మీ యొక్క డేటా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ చేయబడుతుంది. మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో చాలా సేఫ్ గా ఉంది అనుకునే డేటా సమాచారం మొత్తం కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడితే కనుక అది మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీ యొక్క డేటాను సురక్షితంగా ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్నకు సైబర్ నిపుణుడు అభిషేక్ ధాభాయ్ కొన్ని సూచనలను తెలియజేస్తున్నారు. వాటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డేటా రక్షణ కోసం ఫోన్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే డేటాను రక్షించుకోవడం కోసం మీ 15-అంకెల IMEI నంబర్‌ను మరొక చోట ఎక్కడైనా సరే జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచండి. మొబైల్ ఫోన్ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నప్పుడు పోలీసు ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. అలాగే స్వయంచాలకంగా లాక్ చేయడానికి ఆటో-లాక్‌ని ఉపయోగించడం మాత్రం మరచిపోకండి. ఫోన్ లాక్ కోసం ముఖ్యంగా పాస్‌కోడ్ యొక్క సెక్యూరిటీ నమూనాను ఉపయోగించి కీప్యాడ్ లాక్‌ని ప్రారంభించవచ్చు.

SIM కార్డ్‌ను లాక్ చేయడానికి PINని ఉపయోగించడం మాత్రం మరవకండి. తద్వారా మీ ఫోన్ దొంగిలించబడినట్లయితే SIM దుర్వినియోగం చేయబడదు. మెమరీ కార్డ్ లో సేవ్ చేయబడిన ఏదైనా సమాచారాన్ని రక్షించుకోవడానికి పాస్‌వర్డ్‌ను సెట్ చేయడం అనేది అధిక భద్రతను అందిస్తుంది. మీ మొబైల్ పరికరాన్ని తరచూ గమనిస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా అజాగ్రత్తగా ఉండకండి. మీ యొక్క ఫోన్ ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు కెమెరా, ఆడియో/వీడియో ప్లేయర్ వంటి అప్లికేషన్‌లను మరియు బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, Wi-Fi వంటి కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. అలాగే డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి.

అన్ని కుక్కీలను ఆమోదించాలా వద్దా?
టెక్నాలజీని అధికంగా వినియోగించే వినియోగదారులు ఎవరైనా సరే తెలియని మరియు తెలిసిన అన్ని రకాల వెబ్‌సైట్‌ల నుండి అన్ని కుక్కీలను అంగీకరించకూడదు. కుక్కీల సహాయంతో మీ యొక్క డివైస్ లోని ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఆ వెబ్‌సైట్‌లకు వెళుతుంది. తరువాత వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు. దీన్ని నివారించడానికి విశ్వసనీయ వెబ్‌సైట్ కుక్కీలను మాత్రమే ఆమోదించాలి. కుక్కీలను వీలైనంత వరకు తిరస్కరించడం ఉత్తమం.

స్పామ్ మెసేజ్ ని బ్లాక్ చేయడం ఎలా?
స్పామ్ కాల్‌లు మరియు మెసేజ్లను నిరోధించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ముందుగా మెసేజింగ్ యాప్‌కి వెళ్లి స్టార్ట్ అని టైప్ చేసి 1909కి పంపడం. రెండవ మార్గం మీ ఫోన్ నుండి 1909కి కాల్ చేయడం. ఫోన్‌లోని సూచనలను అనుసరించడం ద్వారా డూ నాట్ డిస్టర్బ్ (DND) సేవను సక్రియం చేయండి. ఈ రెండు పద్ధతులతో మీ ఫోన్‌లో ఇన్‌కమింగ్ కాల్‌లు మరియు మెసేజ్‌లు తగ్గుతాయి. Truecaller లేదా కాల్ బ్లాకర్స్ వంటి కొన్ని యాప్‌ల సహాయంతో కూడా మీరు స్పామ్‌ను గుర్తించవచ్చు. ఇది పూర్తిగా మాల్వేర్ లేనిది అయినప్పటికీ ఇది అవసరం లేదు.

క్లౌడ్ సర్వర్‌కు ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైన IP అడ్రస్ ఉంటుంది. అది వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మరియు డేటాను మరొకరికి పంపడానికి వీలు కల్పిస్తుంది. ఒక సంస్థ ఈ అడ్రసును ఉపయోగించి పూర్తి చేసిన తర్వాత అది సర్వీస్ ప్రొవైడర్ యొక్క మరొక క్లయింట్‌కు అందించబడుతుంది. కంపెనీలు ఉపయోగించే సర్వీసును మార్చినందున ప్రతి అరగంటకు ఒకసారి IP అడ్రసులు మారుతూ ఉంటాయి. అయితే సంస్థలు క్లౌడ్ సర్వర్‌ని ఉపయోగించి వారి సిస్టమ్‌ల నుండి IP అడ్రసుకు సంబంధించిన సూచనలను తీసివేయనప్పుడు వినియోగదారులు అసలు సర్వీసును ఉపయోగిస్తున్నారని భావించి ఈ అడ్రసుకు డేటాను పంపగలరు. ఇది విశ్వసనీయ సర్వీస్ అయినందున వినియోగదారుల పరికరాలు GPS లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ మరియు పేమెంట్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

మొబైల్ యాప్‌ల నుండి అధిక మొత్తంలో బిజినెస్ డేటాను లీక్ చేస్తున్నాయని ఒక అధ్యయనం కనుగొంది. ఈ యాప్‌లు యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనదారులతో పంచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి కానీ IP అడ్రసును దాడి చేసే వ్యక్తికి డేటాను లీక్ చేసింది. క్లౌడ్ అకౌంటుకు యాక్సెస్ ఉన్న ఎవరైనా హాని కలిగించే సంస్థల నుండి అదే డేటాను సేకరించవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వారు ఉపయోగించే యాప్‌ల ద్వారా వ్యక్తిగత డేటాను పంచుకుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో సగం మంది కొన్ని రకాల యాప్‌ల ద్వారా తమ ఆచూకీని పంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు ఉన్నారని తాజా సర్వేలో తేలింది. కానీ ఈ సమాచారం వారి గుర్తింపును దొంగిలించడానికి లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉపయోగించబడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470