Home
News

ఏటిఎంకు వెళుతున్నారా, అయితే ఈ ఫీచర్లు చెక్ చేసుకోండి

ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎంని ఉపయోగిస్తుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు దగ్గర రష్ ఎక్కువగా ఉ

ఈ రోజుల్లో చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఏటీఎంని ఉపయోగిస్తుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు దగ్గర రష్ ఎక్కువగా ఉంటే మనకు కనిపించేది ఏటీఎం మాత్రమే. మీరు ఏటీఎంకి వెళ్లినప్పుడు కేవలం నగలు మాత్రమే డ్రా చేస్తుంటారు. మీరు అక్కడ నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ మీకు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. ఆ సర్వీసులు ఏంటో ఓ సారి చూద్దాం.

ఏటిఎంకు వెళుతున్నారా, అయితే ఈ ఫీచర్లు చెక్ చేసుకోండి

మొబైల్ నెంబర్‌ను రీచార్జ్ ఇప్పుడు ఏటీఎంల ద్వారా మొబైల్ నెంబర్‌ను రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్లకు కూడా ఇక్కడ నుండి రీచార్జ్ చేయవచ్చు. ఇందుకోసం ఏటీఎం స్క్రీన్‌పై మొబైల్ రీచార్జ్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్

ఫిక్స్‌డ్ డిపాజిట్

మీరు ఏటీఎం సెంటర్ నుండే ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించ వచ్చు. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. అక్కడ ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నారు.. ఎంత మొత్తం డిపాజిట్ చేస్తారు అనే వివరాలు కూడా అందించాలి.

పన్ను

పన్ను

కొన్ని బ్యాంకులు ఏటీఎం నుంచే ఆదాయపు పన్ను చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ డ్యూ వంటి సేవలను ఏటీఎం ద్వారా పొందవచ్చు. ఈ సేవల కోసం ముందుగా బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సౌకర్యాన్ని చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి. రూ.100, రూ.500, రూ.2,000 నోట్లను ఏటీఎం మెషీన్‌లో డిపాజిట్ చేయవచ్చు. దీనికోసం సపరేట్ మిషన్లను ఏటీఎంలో బ్యాంకులు ఉంచాయి.

 రైల్వే టికెట్ బుకింగ్

రైల్వే టికెట్ బుకింగ్

కొన్ని బ్యాంకులు వాటి ఏటీఎంలలో రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి బ్యాంకులను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సేవలు కొన్ని ప్రాంతాలు, రైల్వే పరిసరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం

ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం

ఏటీఎం సాయంతో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించవచ్చని తెలుసా. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటి కంపెనీలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీంతో పాలసీ ప్రీమియాన్ని ఏటీఎం నుంచే కట్టేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి.

పర్సనల్ లోన్

పర్సనల్ లోన్

కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు ఏటీఎంల ద్వారానే ప్రిఅప్రూవ్డ్ పర్సనల్ రుణాలను అందిస్తున్నాయి. కాబట్టి ఏటీఎం నుంచే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోయినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఏటీఎం ద్వారా ఇతరుల అకౌంట్‌కు పంపొచ్చు. బెనిఫీషియరీ అకౌంట్‌ను ఆన్‌లైన్ లేదా బ్యాంక్ బ్రాంచ్ వద్ద రిజిస్టర్ చేసుకోవచ్చు.

యుటిలిటీ బిల్లులు

యుటిలిటీ బిల్లులు

ఏటీఎంల నుంచి యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించొచ్చు. టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు వంటి వివిధ రకాల బిల్లులను ఏటీఎం నుంచి కట్టేయవచ్చు. ఈ సేవల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌‌లో బిల్లర్‌ను ముందుగానే రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

 అదనపు సర్వీసులు

అదనపు సర్వీసులు

ఇవే కాకుండా బ్యాంక్ ఏటీఎంలలో బ్యాలెన్స్ ఎంక్వైరీ, అకౌంట్ స్టేట్‌మెంట్, ఏటీఎం పిన్ ఛేంజ్, చెక్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, డొనేషన్స్ ఇలా మరిన్ని సేవలు కూడా లభిస్తున్నాయి. మీరు ఏటీఎంకి వెళ్లినప్పుడు ఒక్కసారి ఈ సేవలను ప్రయత్నించి చూడండి.

More from GizBot

Best Mobiles in India

English summary
useful services provided by the ATM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X