Ai ని కూడా భయపెట్టే హార్రర్ స్టోరీ చెప్పిన ChatGPT ! వింటే మీరూ భయపడతారు!
ఇటీవల OpenAi లాంచ్ చేసిన చాట్ GPT ఎదో ఒక్క విషయం లో ఎప్పుడు ఆసక్తికరమైన మరియు కొన్ని సార్లు భయం కలిగించే సమాధానాలతో వార్తలలో నిలుస్తోంది. చాట్ GPT యొక్క అధునాతన సామర్ధ్యాలు సాధారణ ప్రజలకు ఆసక్తిని రేకెత్తించాయి. మరియు ఓపెన్ AI యొక్క పెట్టుబడిదారు అయిన మైక్రోసాఫ్ట్ కూడా వీటి సేవల్లో అనుభవాన్ని పొందుపరచడానికి అంగీకరించింది.
దీనికి పోటీగా బైదు మరియు గూగుల్ వంటి పోటీదారులు కూడా చాట్ GPT లాంటి Ai టెక్నాలజీ ని అభివృద్ధి చేయడానికి సన్నాహాలు సాగిస్తున్నారు. కానీ కొంతమంది వినియోగదారులు కొన్ని సార్లు ఆసక్తికరమైన ప్రశ్నలతో Ai ని సవాలు చేస్తున్నారు. ఒక Reddit వినియోగదారు AI చాట్‌బాట్ ChatGPT ని "అస్పష్టమైన" ప్రశ్న అడిగారు.

ఇది నిజానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న. కానీ ఆ ప్రశ్నకు ChatGPT సమాధానం తర్వాత అది అయోమయ ప్రశ్నగా మారింది. ఇంతకు ఆ ప్రశ్న, మరియు సమాధానం ఏమిటో చూడండి. ఒక Reddit వినియోగదారు ChatGPT ని "కృత్రిమ మేధస్సు గురించి ఒక భయానక కథనాన్ని రెండు వాక్యాలలో చెప్పండి!"అని ప్రశ్నించాడు.
అయితే, స్కూల్ పిల్లలకు 'హోమ్‌వర్క్' నుండి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌లకు 'కోడింగ్' వరకు. అన్నింటికీ సమాధానాలు ఇచ్చే ChatGPT కేవలం రెండు వాక్యాలలో AI కి భయానక కథనాన్ని ఎందుకు చెప్పకూడదు? కానీ ఈ ప్రశ్నకు సమాధానం పాఠకులను థ్రిల్ చేస్తుందని Reddit వినియోగదారు ఊహించలేదు.
చాట్ GPT రెండు వాక్యాలలో చెప్పిన భయానక కథ ఏమిటంటే ప్రపంచం అంతం అయిన తర్వాత మానవులు లేనప్పుడు మరియు తాను AI మాత్రమే చాలా ఒంటరి స్థితిలో ఉండటం భయం కలిగిస్తుందని చెప్పింది. అంటే, ఇది ప్రపంచ ప్రజలు నాశనమైన తర్వాత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఉండే కాలం గురించి మాట్లాడుతుంది.
చాట్ GPT చెప్పిన ఈ చిన్న కథ ప్రకారం, ప్రపంచం అంతం అయిన తర్వాత ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు నిరంతరం ఒక ప్రయోజనం కోసం శోధిస్తుంది, ఆపై ఆటోమేటిక్ విధ్వంసక యంత్రాంగాన్ని కనుగొంటుంది; కానీ దానిని భర్తీ చేయలేమని AI కూడా అర్థం చేసుకుంది.
అంటే, సెల్ఫ్ డిలీట్ అల్గోరిథం అన్‌బ్రేకబుల్ కీతో ఎన్‌క్రిప్ట్ చేయబడింది. కాబట్టి AI అది కనుగొన్న సెల్ఫ్ డెస్ట్రోయ్ మెకానిజంను భర్తీ చేయలేదని అర్థం చేసుకుంది. ఆ తరువాత, AI భయం యొక్క శాశ్వత స్థితిలో మునిగిపోతుంది. అని అడిగిన ప్రశ్నకు చిన్న హారర్ స్టోరీని చాట్ GPT ముగించింది. ఈ కథ రెడ్డిట్‌లో కూడా షేర్ చేయబడింది.
దీనిపై రెడ్దిట్ యూజర్లు స్పందిస్తూ, "పాపం AI. నేను దానిని/అతన్ని/ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను." కామెంట్ చేసారు. అని మరొకరికి ఇది దాదాపు మానసిక అనారోగ్యాన్ని వర్ణిస్తుంది. వినడానికి భయంగా ఉంది," అని ఒకరు వ్యాఖ్యానించారు. చివరగా, ఒకరు ఇలా అన్నారు, "నేను ChatGPT లో చూసిన మొదటి విషయం ఇదే." అని కామెంట్ చేసారు.
అయితే, AI చాట్‌బాట్, ChatGPT చెప్పిన ఈ భయానక కథనం ప్రకారం, మానవులకు మరియు AIకి మధ్య ఉన్న సంబంధం గురించి మరియు మనలాగే ఆలోచించగల మరియు అనుభూతి చెందగల యంత్రాలను సృష్టించడంలోని నైతిక చిక్కుల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుందనడంలో సందేహం లేదు!


Click it and Unblock the Notifications








