Home
News

ఫోన్‌లాక్‌ అయినప్పుడు కూడా యూట్యూబ్‌ పాటలు వినొచ్చు.. ఉచితంగానే..!

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో అత్యధిక శాతం యూట్యూబ్‌ను వినియోగిస్తుంటారు. కొన్ని సమయాల్లో చేతిలోనే ఫోన్ పట్టుకొని యూట్యూబ్‌లో నచ్చిన కంటెంట్‌ను చూస్తుంటాం. మరి కొన్నిసార్లు వేరే పని చేస్తూ యూట్యూబ్‌లో పాటలు, లేదా వీడియోలు వింటుంటాం. కొంత సమయం అయిపోయాక.. ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే ఆగిపోయింది. ఫలితంగా యూట్యూబ్‌ కూడా ఆగిపోతుంది.

అలాగే యూట్యూబ్‌ చూస్తు కొన్నిసార్లు వేరే యాప్‌లు ఓపెన్‌ చేస్తుంటాం. ఆ సమయంలోనూ యూబ్యూబ్‌కు ఆగిపోతుంది. అటువంటి సమయాల్లో కొంచెం అసహనానికి గురవుతుంటాం. ఫోన్‌ లాక్‌ అయినప్పుడు లేదా వేరే యాప్‌లు వినియోగిస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్‌లో యూట్యూబ్‌ నుంచి పాటలు, లేదా వీడియోలు ప్లే కావాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఐఫోన్‌ వినియోగదారులు వారు వినియోగిస్తున్న బ్రౌజర్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఉచితంగానే.. ఈ సేవలు పొందవచ్చు.

YouTube

యూట్యూబ్‌ ప్రీమియం వెర్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలు, వీడియోలు ప్లే అయ్యే సౌలభ్యం ఉంటుంది. ప్రీమియం వెర్షన్‌ కోసం కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ చేసుకుందామా అంటే అందుకు సైతం సుమారు 989 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐఫోన్‌ యూజర్లు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లోనూ పాటలు వినే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

దీని ద్వారా ఐఫోన్‌ లాక్‌ అయినా లేదా ఇతర యాప్‌లు వినియోగిస్తున్నా.. ఎటువంటి అసౌకర్యం కలగకుండా యూట్యూబ్‌ కంటెంట్‌ను ఆశ్వాదించవచ్చు. ఐఫోన్లలో పాపులర్‌ బ్రౌజర్‌ అయిన సఫారీతో ఈ సదుపాయం పొందవచ్చు.

అయితే సఫారీ యాప్‌ సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. ముందుగా సఫారీ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం డెస్క్‌టాప్‌ వెర్షన్‌కు మారాలి. తర్వాత యూబ్యూబ్‌ ఓపెన్‌ చేసిన మీకు నచ్చిన కంటెంట్‌ను చూడవచ్చు. ఐఫోన్‌ లాక్ అయినా కూడా నిరంతరాయంగా ఆశ్వాదించవచ్చు.

ఐఫోన్‌లో యూట్యూబ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా ప్లే చేయాలంటే..
1. మొదట మీ ఐఫోన్‌లో సఫారీ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి youtube.comకు నేవిగేట్‌ అవ్వాలి.
2. అనంతరం యూట్యూబ్‌లో మీకు కావాల్సిన కంటెంట్‌ను ఎంచుకోండి.
3. సఫారీ అడ్రస్‌ బార్‌లోకి వెళ్లండి.
4. పాప్‌అప్‌ మెనూలోకి వెళ్లి "రిక్వస్ట్‌ డెస్క్‌టాప్‌ వెబ్‌సైట్‌" పైన క్లిక్‌ చేయాలి.
5. అనంతరం యూట్యూబ్‌ను నిరంతరాయంగా ఆశ్వాదించవచ్చు. మధ్యలో యూట్యూబ్‌ యాప్‌కు సంబంధించిన ఏమైనా పాప్‌ అప్‌లు కనిపించినా వెంటనే డిస్మిస్‌ చేయండి.
6. అనంతరం మీ ఐఫోన్‌ను లాక్‌ చేయవచ్చు.
7. లాక్‌ చేసిన అనంతరం యూబ్యూబ్‌ ఆగిపోతుంది. అక్కడ డిస్‌ప్లే పైన కనిపించిన ఆడియో బటన్‌ను క్లిక్‌ చేసి నిరంతరాయంగా కంటెంట్‌ను ఆశ్వాదించవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన విధంగా మీ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేసి ఎటువంటి అంతరాయం లేకుండా యూట్యూబ్‌ కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
users can continue access YouTube when phone locked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X